hamburgerIcon

Orders

login

Profile

Profile
Mylo Joyful DaysSkin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Pregnancy Best Foods arrow

  • గర్భధారణ సమయంలో వేరుశనగ: సురక్షితమా, కాదా ? arrow

In this Article

    గర్భధారణ సమయంలో వేరుశనగ: సురక్షితమా, కాదా ?

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో వేరుశనగ: సురక్షితమా, కాదా ?

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ అనేది నిస్సందేహంగా స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాలలో ఒకటి. అందుకే, ఏ ఆహారాలు సురక్షితమైనవి, ఏవి కావు అని తెలుసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో తినడం మంచిదా, కాదా అని మహిళలు తరచుగా ఆలోచించే ఆహారం వేరుశనగ. ఈ వ్యాసంలో, గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలు, వేరుశనగ శిశువు అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది, ఏదైనా అలెర్జీ సమస్యలు, లేక ఇతర దుష్ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా అనేవిషయాలు విపులంగా తెలుసుకుందాము. ఈ వ్యాసం గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం మంచిదా అనే దానిపై పాఠకులకు మంచి అవగాహనను కలిగిస్తుంది.

    గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం సురక్షితమేనా , కాదా?

    గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వివాదాస్పదమైన అంశం. కొంతమంది నిపుణులు గర్భవతులు వేరుశనగ తినడం గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువుకు కూడా క్షేమం కాదని నమ్ముతారు, మరికొందరు వేరుశనగ అలెర్జీలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుందని నమ్ముతారు. వేరుశనగ ఒక సాధారణ అలెర్జీ కారకమనీ, గర్భిణీ స్త్రీలు వేరుశనగ కలిగి ఉన్న ఆహారాన్ని తినడాన్ని మానుకోవాలని కొందరు సలహా ఇస్తారు. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల శిశువులలో ఖచ్చితంగా అలెర్జీలు వస్తాయని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు గర్భధారణ సమయంలో వేరుశనగ తినడంద్వారా అలెర్జీలను గురి అయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిరూపించాయి.

    అందువల్ల, గర్భవతిగా ఉన్నవారు, వేరుశనగ అలెర్జీ ఉన్న మహిళలు లేదా గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఆందోళన చెందుతున్నవారు సలహా కోసం మంచి గైనకాలజిస్టును కాని, మంత్రసానిని కాని సంప్రదించడం మంచిది. వారు తరచుగా కలుసుకొనే డాక్టరుకు వారి ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టి వారు సరైన సలహా చెప్పడమేకాక అవసరమైతే సరైన నిపుణులకు లేదా చికిత్సకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన(ఒక రకమైన ఆహారపదార్థం) ఎందుకు తీసుకోవాలి?

    గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల ప్రయోజనాలు

    గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి క్రింద జాబితాలే చేర్చబడ్డాయి:

    • అవి ఫోలేట్, మెగ్నీషియం మరియు విటమిన్-ఇ తో సహా ప్రోటీన్ మరియు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
    • వేరుశనగ గర్భిణీ స్త్రీలకు వారి పెరిగిన కేలరీల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది మరియు బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
    • గర్భవతులకు సాధారణంగా గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం తగ్గించడానికి, రాకుండా చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. వేరుశనగలో ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి, ఇవి పిండం అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి.
    • డెలివరీ సమయంలో స్త్రీలకు రక్తహీనత చాలా సమస్యాత్మకమౌతుంది. వేరుశనగలోని గింజలలో ఇనుము పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనత వంటి రక్త సంబంధిత పరిస్థితులను నివారిస్తుంది.
    • వేరుశనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉండటం వల్ల గర్భరక్షణకు మంచిది. ఈ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ యాసిడ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

    వేరుశనగ అలెర్జీ - ప్రాథమిక అంశాలు

    వేరుశనగ అలెర్జీ అనేది పిల్లలలోను, పెద్దలలోను ఉండే అత్యంత సాధారణ ఆహార అలెర్జీలలో ఒకటి. ఈ అలెర్జీలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మరియు ప్రాణాంతకంగా కూడా ఉంటాయి. వేరుశనగలోని ప్రోటీన్, వారి అలెర్జీని మరింత పెంచుతుంది. అందువల్ల, వేరుశనగ అలెర్జీ ఉన్న గర్భవతులు వేరుశనగ తినడం మంచిదా, కాదా అని ఆలోచించడంలో ఆశ్చర్యంలేదు. గర్భం సురక్షితంగా ఉండాలంటే, ఈ అలెర్జీ ఉన్న మహిళలకు వేరుశనగను ఇవ్వకపోవడం మంచిది. ప్రత్యేకించి ఈ అలెర్జీ తీవ్రంగా ఉంటే. ఇది శిశువును నేరుగా ప్రభావితం చేయనప్పటికీ, ఇది తల్లిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది, తద్వారా గర్భధారణ సమయంలో సమస్యలను కలిగిస్తుంది. నిజానికి వేరుశనగను చాలా ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం, కాబట్టి అలెర్జీ ఉన్నవారు ఆహారం తీసుకునేటప్పుడు వాటిని కూడా గమనించాలి.

    వేరుశనగను విరివిగా వాడే ఉత్పత్తుల్లో చాక్లేట్ బార్లు, క్యాండీలు, గ్రానోలా బార్లు, తృణధాన్యాలు వంటివి మరెన్నో ఉన్నాయి. వాస్తవానికి, ఆసియాకు చెందిన అనేక వంటకాల్లో వేరుశనగ వాడకం చాలా ప్రబలంగా కనబడుతుంది. వేరుశనగను అనేక వంటకాల్లో ప్రధాన దినుసుగాను, సాస్ తయారీలోను ఉపయోగిస్తుంటారు. అలెర్జీలకు బలమైన వంశపారంపర్య భాగం ఉందని చాలాకాలంగా భావించారు. అయితే, అలా కాదని రుజువైంది. కొందరికి వాటిని తినడం వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చుకూడా. ఎలాగంటే, తండ్రి కుటుంబంలో వేరుశనగ అలెర్జీ చరిత్ర ఉన్నా, తల్లికి అది లేకపోతే, పిల్లలకి తప్పనిసరిగా రావాలని లేదు. అలాంటప్పుడు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. కాబట్టి గర్భధారణ సమయంలో వేరుశనగ తినడం వల్ల పిల్లలలో అలెర్జీ కలుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

    ముగింపు

    కాబట్టి, సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా వేరుశనగను మితంగా తినడం సురక్షితం. అయినప్పటికీ, అలెర్జీ ఉన్నవారికి, వాటిని పూర్తిగా నివారించడం మంచిది. వేరుశనగ అలెర్జీ ఉన్న కుటుంబ చరిత్రను బట్టి వాడడం మాననక్కరలేదు. ఏదేమైనా, ఆహారంలో ఏవైనా మార్పులు చేయడానికి గాని, గర్భవతి ఆహారంలో వేరుశనగను జోడించడానికి గాని ముందు డాక్టరుతో మాట్లాడటం చాలా ముఖ్యం.

    చివరగా, వేరుశనగ మరియు వేరుశనగ ఉత్పత్తులు అధిక స్థాయిలో సోడియం, కొవ్వు మరియు కేలరీలను కలిగి ఉన్నందున, గర్భంతో సంబంధం లేకుండా వాటిని మితంగా తినాలని ఇప్పటికీ సిఫార్సు చేయబడింది. గర్భధారణ సంబంధిత ఆరోగ్య సంరక్షణ మరియు స్వీయ సంరక్షణపై మరిన్ని చిట్కాల కోసం లేదా నవజాత శిశువును ఎలా చూసుకోవాలో అంతర్దృష్టుల కోసం, మైలో ఫ్యామిలీ వెబ్సైట్ను అన్వేషించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    businessWorld
    cnbc
    financialExp
    economicTimes
    businessToday
    toi
    inc42
    businessStandard
    yourStory
    ani
    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo
    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.