hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Lowest price Ever for Children's Day! Use Code: FIRST10Lowest price Ever for Children's Day! Use Code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్ arrow

In this Article

    గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

    3 November 2023 న నవీకరించబడింది

    టాపియోకా(కర్రపెండలం పిండి) గురించి ఇది వరకెపుడూ వినలేదా? ఈ పేరే ఆశ్చర్యకరంగా ఉందా.. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. టాపియోకా(కర్రపెండలం పిండి) అనేది కసావా రూట్స్ (వేర్లు) నుంచి లభిస్తుంది. దాని నుంచి పిండిపదార్థం(స్టార్చ్​) సంగ్రహించబడుతుంది. గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా(కర్రపెండలం పిండి) తీసుకోవడం వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా? గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా(కర్రపెండలం పిండి) తినొచ్చా, లేదా అనే విషయం మీద వైద్యులు, న్యూట్రీషియన్లు, ఆరోగ్య నిపుణులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది గర్భవతులకు మంచిదని కొంత మంది అంటుంటే.. టాపియోకా(కర్రపెండలం పిండి) ఇతర పిండిలాగే ఉంటుందని ఇందులో శిశువు పెరుగుదలకు ఉపయోగపడే ఎటువంటి ప్రత్యేక పోషకాలు లేవని కొంత మంది చెబుతారు.

    గోధుమలు, బియ్యం, మొక్క జొన్న వంటి పదార్థాల నుంచి వచ్చే పిండి కంటే ఈ పిండి చాలా రుచిగా ఉంటుంది. టాపియోకా(కర్రపెండలం పిండి) ఫైబర్​కు మంచి మూలం. అంతే కాకుండా ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మీరు గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) తీసుకోవచ్చా? లేదా అని ఆశ్చర్యపోతున్నారా.. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు కర్రపెండలం ఉపయోగించి ఎటువంటి వంటలు చేసుకోవచ్చు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

    టాపియోకా(కర్రపెండలం పిండి)లో ఉండే పోషకాలు

    టాపియోకా (కర్రపెండలం పిండి)లో తక్కువ పరిమాణంలో ఉన్నా కానీ.. వివిధ రకాల వెరైటీ మినరల్స్, న్యూట్రియంట్స్ ఉన్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్స్, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బి ఉన్నాయి. కానీ.. ఈ న్యూట్రియంట్స్ మరియు మినరల్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వలన ఇవి గర్భవతులకు పూర్తి ప్రయోజనకరంగా ఉండవని చాలా రకాల థియరీస్ ఉన్నాయి. గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా (కర్రపెండలం పిండి) ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు కాబట్టి గర్భవతిగా ఉన్నపుడు టాపియోకా (కర్రపెండలం పిండి) నుంచి పోషకాలను పొందడం కొంచెం కష్టమే.

    గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) తినడం సురక్షితమేనా

    ఎన్నో అధ్యయనాలు మరియు ఫలితాల నివేదిక ప్రకారం.. టాపియోకా (కర్రపెండలం పిండి) అనేది ఎక్కువ కేలరీలను కలిగి ఉండదు. టాపియోకా (కర్రపెండలం పిండి) కసావా (కర్రపెండలం) వేర్ల నుంచి తయారవుతుంది. తాజా కసావా(కర్రపెండలం) వేర్లు పోషకవిలువలను కలిగి ఉంటాయని పరిగణించబడింది. ఈ కారణం చేతే గర్భధారణ సమయంలో ప్రయోజకరంగా పరిగణించబడుతుంది. ఏదేమైనా ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉండవు. అందువల్ల కేవలం టాపియోకా (కర్రపెండలం పిండి) మాత్రమే తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. చాలా మంది ప్రజలు టాపియోకా(కర్రపెండలం పిండి)ను వివిధ రకాలుగా వండుతారు. వంట చేయడం వల్ల దీనిలో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. వంట చేసిన తర్వాత దీనిలో ఎంతో ప్రయోజకరమైన పోషకాలు ఉండవు. అందువల్ల గర్భిణీ స్త్రీకి పెద్దగా ప్రయోజకరంగా ఉండదు.

    గర్భధారణ సమయంలో టాపియోకా (కర్రపెండలం పిండి) శరీరానికి మంచిదేనా అనే ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం చెప్పొచ్చు. దీనిలో అధిక పోషక విలువలు లేనందున అధిక మోతాదులో తినవలసి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో అధిక మొత్తంలో టాపియోకా (కర్రపెండలం పిండి) తీసుకోవడం మంచిది కాదు. టాపియోకా(కర్రపెండలం పిండి)ను చిన్న మొత్తాల్లో తినాలి. అలా చిన్న మొత్తాల్లో గర్భవతులు కూడా తినొచ్చు. కానీ ప్రతి రోజు తినకూడదు. గర్భవతులు టాపియోకా (కర్రపెండలం పిండి) మీద మాత్రమే ఆధారపడకుండా అన్ని రకాల పోషక విలువలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి.

    గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) వల్ల కలిగే ప్రయోజనాలు

    గర్భధారణ సమయంలో టాపియోకా (కర్రపెండలం పిండి) తీసుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

    • ఇది కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. లేచిన తర్వాత పొద్దపొద్దున దీనిని తీసుకోవడం చాలా మంచిది. టాపియోకా (కర్రపెండలం పిండి)లో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంలో గొప్పగా సహాయపడతాయి.
    • మీ శరీరం అలసిపోయినట్లు, బలహీనంగా అనిపించకుండా ఉండేందుకు మీరు టాపియోకా (కర్రపెండలం పిండి) తినడం చాలా మంచిది.
    • మీరు గర్భవతిగా ఉన్నపుడు బరువు తక్కువగా ఉన్నా కానీ తక్కువ బరువు సమస్యలతో బాధపడుతున్నా కానీ టాపియోకా (కర్రపెండలం పిండి) తీసుకోవడం చాలా మంచిది. గర్భధారణ సమయంలో ఇది తినడం వలన శరీరం కోల్పోయిన బరువును తిరిగి పొందొచ్చు.
    • టాపియోకా (కర్రపెండలం పిండి)లో ఫైబర్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో గొప్పగా సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా మలబద్ధకం మరియు ఉబ్బరాన్ని ఎదుర్కొంటారు. కానీ టాపియోకా (కర్రపెండలం పిండి)ని తీసుకోవడం వలన మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
    • టాపియోకా (కర్రపెండలం పిండి)ని తినడం వలన గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, యాసిడిటీ వంటి సమస్యల నుంచి గర్భిణీ స్త్రీలు విముక్తి పొందొచ్చు.
    • టాపియోకాలో కార్బోహైడ్రేట్లతో పాటుగా విటమిన్ B కాంప్లెక్స్​తో పాటు ఫోలేట్ కూడా ఉన్నాయి. పిండంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఇది అవసరం.
    • గర్భధారణ సమయంలో టాపియోకా (కర్రపెండలం పిండి) చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్టార్చ్ రెసిస్టెంట్ (పిండి పదార్థాల నిరోధక లక్షణం) లక్షణాలను కలిగి ఉంటుంది. గర్భవతి తన శరీరంలో సరైన మోతాదులో బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. టాపియోకా (కర్రపెండలం పిండి) అనేది శరీరానికి ఇన్సులిన్ సెన్సిటివిటీని (సున్నితత్వం) మెరుగుపరుస్తుంది.

    గర్భధారణ సమయంలో టాపియోకా(కర్రపెండలం పిండి) తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

    టాపియోకా(కర్రపెండలం పిండి) గర్భవతులకు చాలా మంచిది. కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం వలన గర్భవతులలో కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. గర్భవతిగా ఉన్నపుడు టోపియోకా(కర్రపెండలం పిండి) తీసుకునే ముందు దాని దుష్ర్పభావాల గురించి కూడా తెలుసుకోవాలి.

    • టాపియోకా(కర్రపెండలం పిండి) అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కొన్ని రకాల యాంటీ న్యూట్రీయంట్స్​ను కలిగి ఉంటుంది. ఇవి శరీరం పోషకాలు, ఖనిజాలు వంటి వాటిని శోషించుకోకుండా చేస్తాయి. టాపియోకా(కర్రపెండలం పిండి) కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్నప్పటికీ దీని వలన తొందరగా బరువు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
    • టాపియోకాను(కర్రపెండలం పిండి) పచ్చి కసావా (కర్రపెండలం) వేర్ల నుంచి తయారు చేస్తారు. ఇది శరీరానికి ఎంతో హాని కలిగించే సైనైడ్ వంటి విషాన్ని కలిగి ఉండే ప్రమాదం ఉంది.
    • టాపియోకా(కర్రపెండలం పిండి)ను అధిక పరిమాణంలో తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే దీని వలన అనవసరంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులు, రక్తంలో అధిక చెక్కెర వంటి సమస్యలకు దారి తీస్తుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.