This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

గర్భధారణ సమయంలో సపోటా ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్(దుష్ప్రభావాలు)

Written by - Kakarla SirishaLast updated: May 28, 2026
గర్భధారణ సమయంలో సపోటా ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్(దుష్ప్రభావాలు)
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • సపోటా పండు విటమిన్లు A, C, పొటాషియం, కాల్షియం ఇంకా యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తిని అందిస్తుంది ఇంకా పోషకాహారంగా పనిచేస్తుంది.
  • సపోటా పండ్లు జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి, ఎముకలను బలపరుస్తాయి ఇంకా రక్తపోటును నియంత్రిస్తాయి. రోజుకు 100 గ్రాముల పండ్లకు పరిమితం చేయడం మంచిది.
  • ఎక్కువగా తీసుకొంటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (గర్భధారణ మధుమేహం) ఇంకా డయేరియా వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. వైద్యుని సలహా తప్పనిసరి.
  • గర్భధారణ సమయంలో పోషకాహారాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు? Explore our Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each.
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9

సపోటా పండును చికూ అని కూడా అంటారు. ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫ్రూట్‌ అంటారు. సపోటా పండులో విటమిన్లు A ఇంకా C, పొటాషియం, కాల్షియం లాంటి కొన్ని ముఖ్యమైన పోషకాలే కాక యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పండు వల్ల ఆరోగ్యకరమైన కేలరీలు కూడా ఎక్కువగానే అందుకోవచ్చు. 100 గ్రాముల సపోటా పండులో 83 కిలో కేలరీలు లభిస్తాయి.

ఈ పండు గర్భిణీ స్త్రీలకు చాలా ఆవశ్యకమైన పోషకాలను అందిస్తుంది. అయితే.. గర్భిణీ స్త్రీలు తమ వైద్యుడిని సంప్రదించకుండా వారి ఆహారంలో కొత్త పదార్థాలను జోడించకూడదు. ఎందుకంటే.. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు ఆరోగ్య సమస్యలు ఇంకా ఆహార సున్నితత్వం (ఫుడ్ సెన్సిటివిటీ) ఏర్పడటమే ఇందుకు కారణం. వైద్యులు గర్భవతుల ఆరోగ్యం చక్కగా ఉండేలా.. వారికి ఇతర ప్రమాదావకాశాలను తగ్గించేందుకు.. వారి రక్త నమూనాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.

గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ఎన్ని సపోటాలు తీసుకోవచ్చు?

గర్భిణీ స్త్రీలకు వారు రోజువారీగా తీసుకోనే తాజా పండ్ల పరిమాణాన్నిపెంచుకోవాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. డాక్టరు గారు వద్దంటే తప్ప, మంచి పోషక విలువలు ఉన్న సపోటా పండ్లను గర్భిణీ స్త్రీలందరూ తీసుకోవడం సురక్షితమే. గర్భధారణ సమయంలో స్త్రీలు ఎన్ని సపోటాలు తీసుకోవచ్చో అనేదానికి నిర్దిష్ట కోటా లేదు. కానీ.. పండులో కేలరీలు ఇంకా చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజుకు 100 గ్రాముల పండ్లను తీసుకొనేలా పరిమితం చేయడం మంచిది. అందువల్ల గర్భిణీ స్త్రీలు తమ బరువు పెరగకుడా ఇంకా ఇతర వైద్యపరమైన సమస్యలను రాకుండా చేసుకోవచ్చు.

గర్భధారణ సమయంలో సపోటా పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు

1. తక్షణ శక్తిని అందిస్తుంది:

సపోటాలో అధిక సుక్రోజ్ ఉంటుంది. ఇది తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు భోజన విరామాల మధ్య మంచి శక్తిని పొందేందుకు ఈ పండ్లను మధ్యాహ్న స్నాక్‌గా తీసుకోవడం బాగుంటుంది.

2. జీర్ణక్రియలో మెరుగుదల:

గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం కలగడం అనేది ఒక సాధారణ సమస్య. గర్భధారణ సమయంలో సపోటా తినడం జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక.. ఇది వికారం ఇంకా కడుపులో మంట రానీయకుండా చేస్తుంది.

3. ఎముకలను బలపరుస్తుంది:

గర్భిణీ స్త్రీలకు అదనపు కాల్షియం అవసరం. అలాగే ఆరోగ్యకరమైన కాల్షియం స్థాయిలను కలిగివుండేలా.. వారికి డాక్టర్లు తరచుగా సప్లిమెంట్లను సూచిస్తారు. ఈ సపోటా పండు కాల్షియం, పొటాషియం ఇంకా ఐరన్ వంటి పోషకాలు దొరికే సహజ వనరు.

4. రక్తపోటును నియంత్రిస్తుంది:

సపోటా పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, అది గర్భిణీ స్త్రీలలో రక్తపోటును నియంత్రించవచ్చు. ఈ పండులో అధిక స్థాయిలో మెగ్నీషియం ఇంకా పొటాషియం ఉన్నాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి అవసరం.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు: రిస్క్‌లు & సైడ్ ఎఫెక్ట్స్

గర్భధారణ సమయంలో సరైన సపోటా పండ్లను ఎలా ఎంచుకోవచ్చు ఇంకా నిల్వ చేసుకోవచ్చు?

గర్భవతులు తమకు ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు వారు తీసుకొనే పండ్లు ఇంకా కూరగాయలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మార్కెట్‌లో చక్కగా పండిన పండ్లు దొరకడం కాస్త కష్టం కాబట్టి మంచి సపోటా పండ్లను ఎంచుకోవడం కొంచెం కష్టతరమని చెప్పవచ్చు.

సపోటా పండ్లను ఎంచుకొనేందుకు టిప్స్

  • తాకినపుడు గట్టిగా ఉండే సపోటాలను ఎంచుకోవాలి
  • పండ్లపై మచ్చలు లేదా రంధ్రాలు ఉన్నాయేమో గమనించాలి.
  • దుర్వాసన వస్తున్న లేదా పై తొక్కలపై ముడతలు ఉన్నా, అలాంటి పండ్లను తీసుకోకూడదు.
  • పండ్లపై తెల్లటి పాలవంటి జిగురు కనిపిస్తే, అవి తాజాగా కోసినవై ఉంటాయి. కాబట్టి అటువంటి పండ్లను తీసుకొనేందుకు ప్రయత్నించాలి.

సపోటా పండ్లను నిల్వ చేయడం

  • సపోటా పండ్లను కొన్న తర్వాత వాటిని శుభ్రపరచి ఆరబెట్టాలి.
  • ఆరిన పండ్లను బియ్యం డబ్బాలో ఉంచాలి. అందువల్ల అవి త్వరగా పండుబారతాయి.
  • పండ్లను రోజుకొకసారి గమనించాలి. ఎందుకంటే ఏవైనా పండ్లు చెడిపోయినా లేదా ఎక్కువగా పండిపోయినా.. వాటిని తీసివేయవచ్చు.
  • గర్భవతులు తీయని వాసననిచ్చే రుచి కలిగిన పండిన సపోటాలను మాత్రమే తినాలి.

గర్భధారణ సమయంలో సపోటా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

గర్భధారణ సమయంలో మితంగా సిఫార్సు చేసిన మోతాదులో సపోటా పండ్లను తీసుకొంటే.. చాల మందికి ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. కానీ, కొందరు గర్భవతులకు ఈ పండ్లను ఎక్కువగా తీసుకొన్నప్పుడు కొన్ని ఇలాంటి దుష్ప్రభావాలు కలగవచ్చు

1. బరువు ఎక్కువ పెరగడం:

సపోటా పండ్లు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాబోయే తల్లులు అనవసర బరువును పొందుతారు. ఇలా బరువు పెరగడం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:

సపోటా పండ్లలో అధిక స్థాయిలలో సుక్రోజ్ ఇంకా ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాబోయే తల్లి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి గర్భధారణలో వచ్చే మధుమేహం(జెస్టేషనల్‌ డయాబెటిస్‌) వచ్చే ప్రమాదముంది.

3. డయారియా:

గర్భవతులు సపోటా పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. ఇది వేగంగా నిర్జలీకరణం(డిహైడ్రేషన్) అయ్యేలా చేసి ఇంకా ఇతర వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చెర్రీపళ్ళు: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు

ఆరోగ్యకరమైన సపోటా మిల్క్‌షేక్ తయారుచేసే విధానం

గర్భవతులకు సిఫార్సు చేసినన్ని సపోటా పండ్లను తీసుకొనేందుకు, ఇంకా వారి సపోటా పండ్లను తినాలనే కోరికలను నెరవేర్చుకొనేందుకు చక్కటి మార్గం వాటిని మిల్క్‌షేక్‌గా మార్చుకోవడం. ఆరోగ్యకరమైన సపోటా మిల్క్ షేక్ తయారు చేసుకొనే త్వరిత విధానం ఇక్కడుంది.

కావలసినవి

  • 1 లేదా 2 పండిన పండిన సపోటా పండ్లు
  • 1 కప్పు పాలు
  • తేనె/చక్కెర

తయారుచేసే విధానం

చిక్కటి సపోటా మిల్క్‌షేక్‌ తయారీకి అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి రెండు నిమిషాలు తిప్పాలి. సపోటా పండు గర్భధారణ సమయంలో తీసుకోకూడని పండు కాదు. కానీ గర్భిణీ స్త్రీలు అదనపు బరువు పెరిగే ప్రమాదాన్ని ఇంకా గర్భధారణ మధుమేహాన్ని(జస్టేషనల్ డయాబెటిస్) నివారించుకొనేందుకు ఈ పండును మితంగా తీసుకోవాలి. గర్భవతులు తమ రోజువారీ ఆహారంలో సపోటా పండును చేర్చుకునే ముందు తమ వైద్యుల సలహాలను కూడా తీసుకోవాలి.

గర్భిణీ తల్లుల పోషణకు నమ్మకమైన తోడు

సపోటా లాంటి పండ్లతో పాటు, సరైన ప్రినేటల్ పోషకాలు మీ ఆరోగ్యాన్ని ఇంకా శిశువు ఎదుగుదలను సమగ్రంగా చూసుకుంటాయి.

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2005 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3701 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.