hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Journey arrow
  • గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్ arrow

In this Article

    గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు & సైడ్ ఎఫెక్ట్స్

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భం దాల్చినపుడు చాలా రకాల పోషకాహారాలు అవసరం. గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండడం కోసం సరైన సమతుల్య పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది మహిళలకు కంకులు (కార్న్​) వారి డైట్​లో అద్భుతమైన భాగం కావొచ్చు. కంకులు (కార్న్​) గర్భిణీ స్త్రీలకు కావాల్సిన శక్తి, విటమిన్స్, మరియు మినరల్స్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. గర్భధారణ సమయంలో కంకులు (కార్న్​) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈ ఆర్టికల్​లో అందించాం. మీ ప్రినేటల్ డైట్​లో కంకులు (కార్న్​) చేర్చుకోవడం ఎందుకు అవసరమో దాని వలన కలిగే ప్రయోజనాలు, పొటెన్షియల్ రిస్క్స్ గురించి మేము మీకు వివరిస్తాం. సమతుల్య మరియు పోషకాలు ఉన్న ఆహారం కోసం గర్భధారణ సమయంలో స్వీట్​ కార్న్‌ని ఉపయోగించడం గురించి మరింత తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

    గర్భధారణ సమయంలో కంకులు (కార్న్​) తినడం సురక్షితమేనా?

    గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తినడం సురక్షితమేనా? కాదా అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని సోర్సెస్ ఇది మంచిదని చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం తినకూడదని వాదిస్తున్నారు. గర్భధారణ సమయంలో స్వీట్ కార్న్ తినొచ్చా? అని మీరు ఆశ్చర్యపోతున్నట్లయితే.. ఇక్కడ సమాధానం ఉంది.

    కార్న్ అనేది కామన్ ఫుడ్ ఎలర్జీ కారకం. గర్భిణీ స్త్రీలు తమకు ఎలర్జీ కలిగించే ఆహారాలను తినొద్దని డాక్టర్లు సిఫారసు చేస్తారు. అంతే కాకుండా కంకులలో (కార్న్​) ఫ్యూమోసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది. అయినప్పటికీ కంకులలో ఫ్యూమోసిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలకు హాని చేసే స్థాయిలో ఉండవు. మీరు గర్భంతో ఉన్నపుడు కార్న్​కు దూరంగా ఉండాలా అని మీకు సందేహం తలొత్తచ్చు. మీకు కనుక కార్న్ ఎలర్జీ ఉంటే.. లేదా పుట్టబోయే బిడ్డకు వచ్చే లోపాల గురించి ఆందోళన చెందుతుంటే.. జాగ్రత్త వహించడం, కార్న్ తినకుండా ఉండడం ఉత్తమం. మీకు ఎటువంటి ఆందోళనలు లేకుంటే కార్న్ తినడం సురక్షితం.

    కంకులలో(కార్న్​) ఉండే పోషక విలువలు

    [Oi1] కంకులు (కార్న్) అనేది ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం. ఇది ఆరోగ్యకరమైన గర్భధారణ డైట్​లో ఇది ఖచ్చితంగా ఉండాలి. దీనిలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కార్న్​లో కొవ్వులు, కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అంతే కాకుండా దీనిలో విటమిన్ C మరియు B6 ఉంటాయి.

    100 గ్రాముల కార్న్​ను సర్వ్ (వడ్డించినపుడు) పోషక విలువలు కింది విధంగా ఉంటాయి.

    • కేలరీలు: 86 గ్రాములు
    • కార్బోహైడ్రేట్లు: 19 గ్రాములు
    • ప్రోటీన్: 3.2 గ్రాములు
    • ఫైబర్: 2.7 గ్రాములు
    • విటమిన్ C: 11శాతం
    • విటమిన్ B6: 5%

    గర్భధారణ సమయంలో స్వీట్​ కార్న్​తో సహా.. రోజుకు ఆరు సార్లు ధాన్యాలు స్త్రీలు తినాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ధాన్యాలు సులభంగా జీర్ణమయ్యేలా ఉడికించుకోవాలి లేదా ప్రాసెస్ చేయాలి.

    గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

    కంకుల(కార్న్​) వలన గర్భిణీ స్త్రీలకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:

    • కంకుల(కార్న్​)లో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధిక పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు తల్లి మరియు పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి చాలా అవసరం.
    • ఫైబర్ అనేది జీర్ణక్రియను రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో ఒక కామన్ సమస్య అయిన మలబద్ధకాన్ని నివారిస్తుంది.
    • యాంటీ ఆక్సిడెంట్స్ కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
    • కంకులు(కార్న్​)లలో కూడా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. శిశువు మెదడు మరియు వెన్నముకలో ఉండే న్యూరల్ ట్యూబ్ అభివృద్ధికి ఇది చాలా అవసరం.
    • పుట్టుకతో మెదడు మరియు వెన్నముకలో వచ్చే సమస్యలను నివారించడంలో కూడా ఫోలిక్ యాసిడ్ సహాయం చేస్తుంది.
    • గర్భధారణ సమయంలో కార్న్ తీసుకోవడం వలన అవసరమైన పోషకాలను అందిచడమే కాకుండా మీకు, మీ చిన్నారికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

    గర్భధారణ సమయంలో కంకులు (కార్న్​) తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

    గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) ఎందుకు తీసుకోకూడదనే విషయాలు ఇక్కడ ఉన్నాయి.

    • మొక్కజొన్న అనేది ఒక సాధారణ ఎలర్జీ కారకం. ఎవరైనా ఎలర్జీ ఉన్న గర్భిణీ స్త్రీలు కంకులు (కార్న్​) తింటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు.
    • అంతేకాకుండా కంకులలో (కార్న్​) గోయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపుతాయి.
    • దీనితో వచ్చే మరో రిస్క్ ఏమిటంటే.. కంకులు(కార్న్​) అధిక గ్లైసెమిక్ ఉన్న ఆహారం. ఇది రక్తంలోని చెక్కెర స్థాయిలు పెరిగేందుకు కారణం కావొచ్చు. మధుమేహం లేదా గర్భధారణ మధుమేహం ఉన్న స్త్రీలకు ఇది ప్రమాదకరం కావొచ్చు.
    • అంతే కాకుండా వాణిజ్య అవసరాల కోసమని పెంచే మొక్కజొన్న పంటల మీద పిచికారీ చేసే పురుగుమందుల వలన కడుపులో పెరుగుతున్న పిండానికి ప్రమాదం ఉంటుందని కొంతమంది నిపుణులు నమ్ముతారు.

    మొక్కజొన్న ఉత్పత్తులలో ఏవి తినాలి వేటికి దూరంగా ఉండాలి

    మీరు గర్భవతిగా ఉండి మీ ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకోవాలని మీరు ఆలోచిస్తుంటే.. అప్పుడు మీరు గుర్తుంచుకుని పాటించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

    గర్భవతిగా ఉన్నపుడు దూరం పెట్టాల్సిన ప్రాసెస్​డ్ కార్న్ ఉత్పత్తులు:

    • కార్న్ చిప్స్
    • మైక్రోవేవ్ ద్వారా వేయించిన పాప్ కార్న్
    • కార్న్ సిరప్

    గర్భవతిగా ఉన్నపుడు తీసుకోవాల్సిన స్వీట్ కార్న్ ఉత్పత్తులు:

    • ఫ్రెష్ కార్న్ నాబ్
    • ఫ్రోజెన్ కార్న్
    • ఆర్గానిక్ లేదా GMO-లేబుల్డ్ కార్న్

    చివరగా..

    ఎవరైనా గర్భిణీ స్త్రీ తినే ఆహారాన్ని కంకులు (కార్న్​) మరింత పోషకమయంగా మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో అవసరమైన అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అయినా కానీ అధిక చెక్కెర కంటెంట్ మరియు జీర్ణసమస్యల వంటి వాటి వల్ల ఎవరైతే గర్భిణీ స్త్రీలు కంకులు(కార్న్​) ను తమ ఆహారానికి జోడించుకోవాలని భావిస్తారో వారు వైద్యుడితో మాట్లాడడం ఉత్తమం. గర్భధారణ సమయంలో కంకులు(కార్న్​) తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. అటువంటి సమయంలో గర్భవతి కావాలని ఆశించే తల్లులు పూర్తి సమాచారంతో నిర్ణయం తీసుకునేందుకు వీలు పడుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.