hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Cradle Cap arrow
  • క్రెడిల్ క్యాప్(చిన్నారి తల మీద డాండ్రఫ్​లా తయారవడం), చిన్నారుల్లో క్రెడిల్ క్యాప్, క్రెడిల్ క్యాప్​కు చికిత్స, క్రెడిల్ క్యాప్​ను తగ్గించే పద్ధతులు, అసలు క్రెడిల్ క్యాప్ అంటే ఏమిటి? arrow

In this Article

    క్రెడిల్ క్యాప్(చిన్నారి తల మీద డాండ్రఫ్​లా తయారవడం), చిన్నారుల్లో క్రెడిల్ క్యాప్, క్రెడిల్ క్యాప్​కు చికిత్స, క్రెడిల్ క్యాప్​ను తగ్గించే పద్ధతులు, అసలు క్రెడిల్ క్యాప్ అంటే ఏమిటి?

    Cradle Cap

    క్రెడిల్ క్యాప్(చిన్నారి తల మీద డాండ్రఫ్​లా తయారవడం), చిన్నారుల్లో క్రెడిల్ క్యాప్, క్రెడిల్ క్యాప్​కు చికిత్స, క్రెడిల్ క్యాప్​ను తగ్గించే పద్ధతులు, అసలు క్రెడిల్ క్యాప్ అంటే ఏమిటి?

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    అసలు క్రెడిల్ క్యాప్ అంటే ఏమిటి?

    మీరు మీ శిశువు తల మీద పొడిబారిన పసుపు రంగు పాచ్​ను గమనించారా? మీరు శిశువు తల మీద కొంత పొడిబారినట్లు కనిపించడంతో జుట్టు కుదుళ్లను పదే పదే కడుగుతున్నారా? అయితే మీ బిడ్డ సెబోరోహెయిక్ డెర్మటిటిస్ (క్రెడిల్ క్యాప్​)తో బాధపడుతూ ఉండవచ్చు. వినేందుకు, చూసేందుకు పేరు భయంకరంగా అనిపించినా కానీ శిశువులకు ఈ వ్యాధి సోకితే అంతలా భయపడాల్సిన పని లేదు. మీ శిశువుకు రెండు వారాల వయస్సు వచ్చినపుడు ఇది కనిపిస్తుంది. మీరు నెత్తిమీద పొడిబారడాన్ని గమనిస్తారు. కేవలం నెత్తి మీద మాత్రమే కాకుండా మెడ, చంకలు, మోకాళ్ల కింద కూడా ఉంటుంది.

    క్రెడిల్ క్యాప్ అనేది పిల్లలను అపరిశుభ్రంగా ఉంచడం వలన రాదు. అసలు ఇది ఎందువలన వస్తుందో సరైన కారణం ఇప్పటికీ తెలియదు. అధిక సెబమ్ ఉత్పత్తి సెబరోహెయిక్ డెర్మటైటిస్​కు కారణం అవుతుంది. దీనికి చికిత్స చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఇది అదృశ్యం కావడం ప్రారంభిస్తుంది. ఇది ఎక్కడా కనిపించదు. మీరు క్రెడిల్ క్యాప్​ డిసీస్​ను గమనించినపుడు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఇది చదువుదాం...

    సెబోరోహెయిక్​ డెర్మటిటిస్​కు(క్రెడిల్ క్యాప్​) కారణమేమిటి?

    • క్రెడిల్ క్యాప్​కు సరైన కారణమేంటో తెలియదు. శిశువు కడుపులో ఉన్నపుడు కానీ తల్లి రొమ్ము పాలిచ్చేటపుడు కానీ తల్లి నుంచి బిడ్డకు హార్మోన్లు రావడం ఒక కారణం కావొచ్చు.
    • ఆక్సిటోసిన్ మరియు ప్రొలాక్టిన్ హార్మోన్లు నూనె గ్రంథులు.. వెంట్రుకల కుదుళ్లలో అధిక నూనె(సెబమ్) ఉత్పత్తికి కారణం అవుతాయి.
    • క్రెడిల్ క్యాప్ అనేది అంటు వ్యాధి కాదు. ఇది అపరిశుభ్రంగా ఉండడం వల్ల సంభవించదు.

    క్రెడిల్ క్యాప్ (సెబోరోహెయిక్​ డెర్మటిటిస్​) లక్షణాలు మరియు సంకేతాలేమిటి?

    సెబోరోహెయిక్ డెర్మటిటిస్ అనేది శిశువు పుట్టిన తర్వాత 2 వారాల నుంచి 12 నెలల వరకు సంభవిస్తుంది. క్రెడిల్ క్యాప్ ప్రభావిత ప్రాంతం పసుపు రంగులో ఉండి పొడిబారినట్లు ఉంటుంది. దాని మీద ఎరుపు రంగులో దద్దుర్లు ఉంటాయి. మెడ వెనుక భాగంలో ఎరుపు రంగులో తేమగా అనిపిస్తుంది. తర్వాత పొడిగా మారి పొరలుగా కనిపిస్తుంది. సెబోరోహెయిక్ డెర్మటిటిస్ ఎక్కువగా జుట్టు కుదుళ్లు, మెడ వెనుక భాగంలో, కనుబొమ్మలు, చెవులు మరియు కొన్ని సార్లు చేతుల కింద కూడా ఉంటుంది. ఇది దురదను కలిగించదు. అయినప్పటికీ తరచుగా చర్మం పొడిబారి కనిపిస్తుంది.

    మీరు క్రెడిల్ క్యాప్​ (సెబోరోహెయిక్ డెర్మటిటిస్)కు ఎలా చికిత్స చేస్తారు?

    శిశువు వయస్సు పెరిగే కొద్దీ క్రెడిల్ క్యాప్ మరియు డెర్మటిటిస్ వాటంతట అవే మాయమవుతాయి. అప్పుడు మీరు చనిపోయి పొలుసులుగా ఉన్న చర్మాన్ని స్ర్కబ్​తో వాష్ చేయొచ్చు. కానీ మీ శిశువు చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుందని గుర్తుంచుకోండి. కావున మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా ఏదైనా చేస్తే మీ చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.

    మీరు అతిగా చేయకుండా ఉండేందుకు ఈ కింది స్టెప్స్ ఫాలో కండి.

    Article continues below advertisment

    1. శుభ్రమైన నీరు లేదా చర్మవ్యాధి నిపుణుడు సిఫారసు చేసిన షాంపూతో కడగాలి.
    2. మీకు ఎక్కువగా లక్షణాలు లేకుండా కట్టుబడి ఉంటే మృదువైన దువ్వెనతో దూయండి.
    3. స్నానానికి ఐదు నిమిషాల ముందు పెట్రోలియం జెల్లీ లేదా వ్యాసెలెన్ ఉపయోగించండి.
    4. మీ తల మీద మరియు నుదుటి మీద ఎక్కువగా నూనెలను వాడకుండా ఉండండి. మీరు అలా వాడడం వల్ల అవి సెబమ్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది.
    5. మీ చర్మ వ్యాధి నిపుణుడు ఒకటి లేదా రెండు యాంటీ ఫంగల్ క్రీమ్స, షాంపూలు లేదా స్టెరాడికల్ క్రీమ్స్​ను సిఫారసు చేయొచ్చు.

    లక్షణాలు తగ్గినా లేదా పెరిగినా కానీ వైద్యుడిని తరచూ సంప్రదిస్తూ ఉండండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: కాపుట్ సక్సెడేనియం: కారణాలు, దానివల్ల కలిగే ప్రమాదాలు, చికిత్స

    క్రెడిల్ క్యాప్ ఉందని ఎలా నిర్దారణ అవుతుంది?

    మీరు తరచుగా శిశు వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటే అతడు క్రెడిల్ క్యాప్​ని ధృవీకరిస్తాడు. పొడిబారిన మరియు పసుపు రంగు చర్మం ఉంటే శిశువుకు క్రెడిల్ క్యాప్​ ఉందని నిర్దారించవచ్చు.

    క్రెడిల్ క్యాప్ నివారణ కోసం ఇంటి చిట్కాలు

    క్రెడిల్ క్యాప్ చికిత్స కోసం బాగా పని చేసే ఇంటి చిట్కాలు

    1. వారానికి 2–3 సార్లు జుట్టు కుదుళ్లను కడగాలని నిర్దారించుకోండి. తేలికపాటి షాంపూని ఉపయోగించండి. తల మీద గీకకండి లేదా ఎక్కువగా రుద్దకండి.
    2. ఆలివ్ ఆయిల్, బాదాం నూనె లేదా కొబ్బరి వంటి నూనెలను తక్కువ మొత్తంలో వేసి మర్దనా చేసి 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత సాఫ్ట్ కుదుళ్లు ఉన్న దువ్వెనతో దూయండి
    3. బేకింగ్ సోడా మరియు నూనెను సమపాళ్లలో కలిపి వాటిని పేస్ట్​లా తయారు చేయాలి. దానిని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి తర్వాత సాధారణ నీటితో కడగండి.
    4. వాష్ చేసిన తర్వాత చర్మం మాయిశ్చరైజ్​గా ఉండాలని గుర్తుంచుకోండి. సరైన మోతాదులో మాయిశ్చరైజర్​ను అప్లై చేయండి. ఎక్కువ మొత్తంలో అప్లై చేయకండి.
    5. పాడయిన కుదుళ్లను తొలగించి కుదుళ్లను ప్రతి రోజు దువ్వండి.

    రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

    తల మరియు ఇతర చర్మపు మడతలను శుభ్రంగా ఉంచడం. చర్మంపై తేలికపాటి క్లీనింగ్ ఏజెంట్​ని మరియు తలపై తేలికపాటి షాంపూని అప్లై చేయడం. మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత షాంపూ మరియు క్లెన్సర్​ని ఉపయోగించడం మంచిది.

    Article continues below advertisment

    దీని గురించి నేను ఇంకా ఏం తెలుసుకోవాలి?

    మీ ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కావున ఒక శిశువుకు పని చేసింది కదా అని ఇతర శిశువులకు ట్రై చేయకూడదు. ఈ వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సెబోరియా డెర్మాటిటిస్ అనేది చికిత్స చేస్తే తగ్గిపోయేది. శరీరంలో అధిక మొత్తంలో సెబమ్ ఉత్పత్తి అనేది కుదుళ్లను అడ్డుకుంటుంది. జుట్టు పెరుగుదలను డ్యామేజ్ చేస్తుంది.

    మీరు ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

    మీ శిశువు తల మీద కానీ ఇతర ఏదేనీ శరీర భాగంలో కానీ ఈ కింది లక్షణాలను గమనిస్తే.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

    • పొరలుగా ఉన్న ఎరుపు రంగు చర్మం
    • తల పైభాగంలో పసుపు పాచ్
    • స్కేల్స్
    • ప్రభావిత ప్రాంతం వెచ్చగా అనిపిస్తుంది
    • తెలియకుండా చర్మం పొడిబారడం

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.