


Missed Period
3 November 2023 న నవీకరించబడింది
చాలామంది స్త్రీలలో సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రకరకాల లక్షణాలు, సూచికలు కన్పిస్తాయి. కొంతమంది మహిళలకి అరుదుగా ఏ రకమైన లక్షణాలు ఉండవు. ఒకవేళ మీరు ఇటువంటి మహిళ అయి, కోరుకోని ప్రెగ్నెన్సీ పొంది ఉంటే బహుశా మీకు వచ్చినది క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే అర్థం సాధారణంగా గర్భం దాల్చినా అది తెలియని వ్యక్తి స్థితిని సూచిస్తుంది. దీన్నే “రహస్య గర్భం” అని కూడా పిలుస్తారు. ఈ స్థితిలో ఆ మహిళ కేవలం ప్రసవం నొప్పులు మొదలైనప్పుడే తను గర్భవతని గ్రహిస్తుంది.
చాలామంది మహిళలు సాధారణంగా నాలుగు నుండి పన్నెండు వారాల మధ్యలో వారు గర్భవతి అని తెలుసుకుంటారు. అదికూడా ప్రెగ్నెన్సీ లక్షణాలను చూపించినట్టయితే లేదా వారి పిరియడ్ను మిస్ అయితే ఇలా తెలుసుకుంటారు. కానీ మీకు వచ్చినది క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయితే ఏ రకంగానూ మీరు గర్భవతి అని అనుమానించడం సాధ్యమవదు. మీ ప్రెగ్నెన్సీ పరీక్ష సరైనది కాకపోవచ్చు అనుకుంటారు. ఇంకా ఇది ప్లాన్ చేయని ప్రెగ్నెన్సీ ఏమో అందుకని ఏ రకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు లేవు లేదా గర్భాన్ని ఏదో వైరస్ సోకినట్టు తప్పుగా భావించే అవకాశం కూడా ఉంటుంది.
పిల్లలు ఉన్న చాలామంది మహిళలకి మరొక స్త్రీ గర్భవతి అయితే తనకి తెలియకుండా ఉంటుందని నమ్మడం కష్టం. చాలా తరచుగా, చాలామటుకు ఇబ్బంది పెట్టే లక్షణాలైన పిరియడ్స్ రాకపోవడం. ప్లానింగ్ లేకుండా గర్భం దాల్చడం, బరువు పెరగడం ఇవన్నీ మీ శరీరం కొత్త జీవికి ప్రాణం పోస్తోందనడానికి స్పష్టమైన గుర్తులు.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వారు సాధారణ గర్భం లేదా ప్లానింగ్ లేని గర్భం వచ్చిన వారి లక్షణాలనే కలిగి ఉంటారు. కానీ ముఖ్యమైన తేడా ఏంటంటే అటువంటి మహిళకి తనకొచ్చే లక్షణాలు ప్రెగ్నెన్సీ వల్ల వస్తున్నాయి అన్నది తెలియదు. ఉదాహరణకి.. ఏదో ప్రత్యేక ఆహారం తిన్నందువల్ల తనకి ఒంట్లో బాలేదని లేదా ఇంకా నిద్ర అవసరం కాబట్టి తొందరగా అలిసిపోయామని ఇలా అనుకోవచ్చు. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ యొక్క ఇతర లక్షణాలు:
ప్రెగ్నెన్సీ అన్నది ప్రతి మహిళని తనదైన రీతిలో ప్రభావితం చేస్తుంది. కొంతమంది యువతులు గర్భం దాల్చిన కొద్దిసేపటికే తాము గర్భవతా అని అనుమానిస్తారు. అదే మరికొందరు పిరియడ్ రాకుండా నెలలు గడిచినా ఎందుకని ఆలోచించకపోవచ్చు.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చే సందర్భాలు చాలా అసాధారణం. అధ్యయనాల ప్రకారం 475 మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే తమకి ప్రెగ్నెన్సీ వచ్చిందని గర్భం దాల్చిన 20 వారాల వరకు తెలుసుకోలేక పోతారు. 2500 మంది మహిళల్లో ఒక్కరు మాత్రమే ప్రసవించే వరకు వారికి అసలు గర్భం వచ్చిందని తెలుసుకోలేరు.
ఆడవారికి అలాగే అప్పుడే పుట్టిన పసిబిడ్డలకి పుట్టుక ముందు ఇచ్చే సంరక్షణ (ప్రీనేటల్ కేర్) ఇంకా తరచుగా పరీక్షల వలన చాలా ప్రయోజనం ఉంటుంది.
గర్భవతి మహిళకి తను గర్భం దాల్చినట్లు తెలియకపోతే, ఆమె అలాగే ఆమె పుట్టబోయే బిడ్డ అవసరమైన సంరక్షణని పొందలేరు. దీనివలన గర్భవతి అయిన అమ్మాయి అలాగే బిడ్డ ఇద్దరూ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో ఎక్కువ శాతం మంది ప్రొఫెషనల్ నిపుణుల సాయం లేకుండానే ఇంటి వద్దనే లేదా ఎక్కడైనా జన్మనిస్తారు. అస్సలు ఊహించనప్పుడు బిడ్డని కనాల్సి రావటం చాలా బాధాకరమైన అనుభవం కావచ్చు. అది మానసిక ఆరోగ్య సమస్యలకి కూడా దారితీయవచ్చు.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ద్వారా పుట్టిన పిల్లలకి, సాధారణ గర్భధారణ సమయంలో కూడా ప్రీనేటల్ కేర్ అందుబాటులో లేని తల్లులకి పుట్టిన చాలామంది పిల్లలలాగా, సమయానికి ముందే పుట్టే, తక్కువ బరువుతో పుట్టే లేదా వారి పిండ వయస్సుకి సరిపడేదానికన్నా సన్నగా జన్మించే రిస్కులు ఎక్కువగా ఉంటాయి. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలలో పురిటి సమయంలోనే బిడ్డలు చనిపోవటం, పుట్టాక కూడా మరణించటం, అలాంటి పిల్లల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించటం వంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
క్రిప్టిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ముఖ్యమైన సమస్య ఏంటంటే.. ఈ లక్షణాలన్నీ మహిళల్లో చాలా సాధారణంగా ఉంటూనే ఉంటాయి. అందుకని డాక్టరుకి అల్ట్రాసౌండులో గర్భాశయం పెద్దగా విస్తరించి అలాగే పిండం స్థిరంగా నిలబడి కన్పిస్తే కానీ ఆ మహిళ గర్భవతి అని తెలియకపోవచ్చు. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలని ఆపటానికి చేయగలిగిన ఒకటే విషయం మహిళలు గర్భనిరోధక పద్ధతిని మరింత జాగ్రత్తగా వాడాలి. అంతవరకూ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళని గర్భవతా కాదా అన్నది గుర్తించడం కష్టం.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips










డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |