
గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకొని, గర్భవతి అయ్యారని వెల్లడించే ఫలితాన్ని చూసుకొనే క్షణం - దీన్ని మించిన అనుభూతి ఏదీ లేదు. గర్భం దాల్చాలి అనుకొనే స్త్రీలకు ఇది మధురమైన తరుణం కావచ్చు, గర్భాన్ని ఆశించని మహిళలకు ఇది అనుకోని పరిణామం కావచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, ఈ ప్రక్రియ అంతా పదిలంగా తమ ఇంట్లో జరిగితే హాయిగా ఉంటుందని అందరూ కోరుకుంటారు. మీకు, మీ భాగస్వామికి మధ్య ఆనంద వేడుకలు ఇంటిలో అయితే సాన్నిహిత్యానికి, ఏకాంతానికి ఆస్కారం ఉంటుంది కదా? ‘ఇంట్లో గర్భ నిర్ధారణ ఎలా చేసుకోవాలి’ అనే సందేహం మీకుంటే ఖంగారు పడకండి. మీకు మేమున్నాం!
ఇంట్లో గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవటం సులభంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేయవలసినదల్లా, ఒక టెస్టింగ్ కిట్ కొనుక్కొని చెప్పబడిన విధానాన్ని అవలంబించటమే. అంతే కదా? అయితే నిజానికి దానికి అంతుకుమించి తెలుసుకోవాల్సింది ఉంది.. నెలసరికి ఆటంకం వచ్చాక లేదా అసురక్షిత శృంగారంలో పాల్గొన్న తర్వాత ‘గర్భ నిర్ధారణ చేసుకోవటం ఎలా?’ అనే సందేహం తలెత్తటం సహజం. ఈ ఆర్టికల్ లో , మీరు అవలంబించాల్సిన విధానాన్ని మేము వివరిస్తున్నాము.
గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకునే ముందు చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. మీ భాగస్వామితో కూర్చొని ఒకరి భావాలను ఒకరితో పంచుకోండి. ఫలితంతో సంబంధం లేకుండా మీ తదుపరి కార్యాచరణకు ప్రణాళిక వేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఫలితానికి సిద్ధమవ్వటానికి కూడా ఇది ఉపకరిస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇది మీ భాగస్వామితో మీ అనుబంధాన్ని పెంచటమే కాక, మీ ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
గర్భ నిర్ధారణ చేసుకోవాలంటే కొన్ని వస్తువులు ప్రధానంగా అవసరం. అతిముఖ్యమైనది హోం ప్రెగ్నన్సీ కిట్. ఎల్లప్పుడూ ఏదైనా సుప్రసిద్ధమైన బ్రాండ్ చే తయారుచేయబడిన కిట్ నే కొనుక్కోవాలి. కిట్ మీదున్న ఎక్స్ పైరీ తేదీని తప్పనిసరిగా చూసుకోవాలి. ఎక్స్పైరీ అయ్యుంటే మీ ఫలితం తప్పుగా వచ్చే అవకాశం, దాని వల్ల అనర్ధాలు జరిగే ప్రమాదముంది. ఫలితం ఖచ్చితంగా ఫలితాన్ని తెలుసుకోవటం కోసం రెండు వేరువేరు కిట్ లు కొనుక్కోవటం మంచిది. ప్రెగ్నన్సీ కిట్ కాక, ఇంకా కావలసినవి ఒక శుభ్రమైన పాత్ర, చదునైన ఉపరితలం, సమయాన్ని చూసుకోవటానికి ఏదైనా పరికరం.
ఇది కొంచెం భయం కలిగించే అంశమే. కానీ సరైన విధానంలో చేస్తే, ఇట్టే పని పూర్తిచేసుకోవచ్చు. ముందుగా ప్రెగ్నెన్సీ కిట్ మీద ప్రింట్ చేసిన సూచనలను చదవాలి. కొన్ని కిట్స్ ఉపయోగించాలంటే విధానం, నేరుగా టెస్ట్ స్టిక్ మీదున్న తడి పీల్చుకొనే భాగం మీద మూత్రవిసర్జన చేయాలి. ఇతర బ్రాండ్లు తయారుచేసే మరికొన్ని కిట్స్ లో ఒక చిన్న పాత్రని, ఒక డ్రాపర్ ని ఇస్తారు. ఎంతసేపు మూత్రవిసర్జన స్టిక్ మీద చేయాలి లేక ఎన్ని చుక్కల మూత్రాన్ని డ్రాపర్ తో స్టిక్ మీద వేయాలి అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మరచిపోకూడదు. మూత్రవిసర్జన క్రమంలో మొదట వెలువడే మూత్రాన్ని కాక, మధ్యన వెలువడే మూత్రాన్ని పరీక్షకు ఉపయోగించాలి. అప్పుడే ఫలితం సరిగ్గా వస్తుంది. స్టిక్ మీద మూత్ర విసర్జన అయిన తర్వాత, చదునైన ఉపరితలం పైన స్టిక్ ను ఉంచాలి.
సరైన ఫలితం కోసం ప్రెగ్నన్సీ కిట్ సూచించినంత సమయం వేచి ఉండాలి. ఆ సమయం దాటగానే, ఫలితం కోసం టెస్ట్ కిట్ ను చూడాలి. సాధారణంగా దానిపై ఉన్న బుల్లి బాక్స్ లో గీతలను బట్టి ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒక్క గీతే కనిపిస్తే ‘గర్భం దాల్చలేదు’ అని అర్థం. రెండు గీతలు కనిపిస్తే, ‘గర్భం దాల్చారు’ అని అర్థం. ఫలితం కనిపించటంలో చాలా విధానాలు ఉన్నాయి. కొన్ని కిట్స్ లో రంగులను ఉపయోగిస్తారు. ఇంకొన్ని కిట్స్ మీద ‘pregnant’ అని గానీ, ‘not pregnant’ అని గానీ కనిపిస్తుంది. ఫలితాన్ని చదవటం ఎలాగో తెలుసుకోవటానికి టెస్ట్ మీద ఇచ్చిన సూచనలు, వివరణలు చదవటం చాలా అవసరం. టెస్ట్ స్టిక్ మీదున్న కంట్రోల్ అనే ప్రదేశాన్ని చూడటం కూడా చాలా కీలకమైన అంశం. ఇక్కడ గీత గానీ, రంగు గానీ, ఆకారం గానీ కనిపించింది అంటే, కిట్ సరిగ్గా పనిచేస్తున్నట్టు లెక్క. ఈ ప్రదేశంలో ఏమీ తేడా కనిపించకపోతే, ఆ కిట్ పనిచేయకపోయే అవకాశం ఉంది. కిట్ ఎక్స్పైర్ అయి ఉండచ్చు లేదా డ్యామేజ్ అయి ఉండవచ్చు.
ఇంట్లో గర్భనిర్ధారణ చేసుకోవటం ఎలా అనేది వివరించే ఈ విధానాన్ని పాటించాక, మీ చేతిలో ఫలితం ఉంటుంది. నెలసరి తప్పినప్పటికీ ఫలితం నెగిటివ్ అయితే, మరోసారి ఇంట్లో గర్భనిర్ధారణ చేసుకోవటం సరైన పని. లేకపోతే ప్రసూతి, గర్భ, స్త్రీ వైద్యనిపుణులను సంప్రదించాలి. అప్పుడు నిస్సందేహంగా మీకు ఫలితం తేలిపోతుంది. మీరు ఆశించే ఫలితం మీకు రావాలని మా ఆకాంక్ష.
Tags:
Pregnancy testing kit, Pregnancy testing kit in telugu, How to use pregnancy testing kit in telugu, How to check pregnancy in telugu, How to read pregnancy testing kit results in telugu, Pregnancy Positive, Pregnancy Negative, Home testing kit in telugu.
Yes
No














Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |