This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?

Rituals & Customs
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
బారసాల అంటే ఏమిటి..? ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించాలి?
Likes149 Likes|
Read time3 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • బారసాల అంటే బిడ్డకు పేరు పెట్టి, ఊయలలో వేసే సంప్రదాయ వేడుక. దీనినే నామకరణ డోలారోహణ లేదా నామకరణం అని కూడా పిలుస్తారు.
  • సాధారణంగా బిడ్డ పుట్టిన 11వ, 16వ, లేదా 21వ రోజున బారసాల జరిపిస్తారు. వీలు కాకపోతే మూడవ నెలలో పవిత్ర ముహూర్తంలో నిర్వహిస్తారు.
  • ఆ రోజు బిడ్డకు స్నానం, విఘ్నేశ్వర పూజ, కటి సూత్ర ధారణ చేసి, పాలు తేనె నాలుకపై ఉంచి, పేరు పెట్టి ఊయలలో పడుకోబెడతారు.
  • బారసాల వేడుకకు బిడ్డకు ఏమి కావాలి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Baby Wooden Cot with Rocker & Wheel
Baby Wooden Cot with Rocker & Wheel
Rating4.6

పరిచయం:

గర్భం దాల్చిన తరువాత ప్రతి అమ్మాయి తనకి పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఎన్నో త్యాగాలు చేసి జాగ్రత్తగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుంది. బిడ్డ గర్భంలో ఉండగానే, తన క్షేమం కోసం సంస్కారాలు ఉన్నాయి. అలాగే.. బిడ్డ పుట్టిన తరువాత కూడా తల్లి తండ్రులు ఆ బిడ్డకు కొన్ని సంస్కారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో "బారసాల" సంస్కారం కూడా ఒకటి.

బారసాల అంటే ఏమిటి?

పసి పిల్లలు పాలు, నిద్ర, మరియు స్నానం పైనే ఆధార పడతారు. వారికి ఈ మూడే బలాన్ని చేకూరుస్తాయి. పాలు, స్నానం ఎంత అవసరమో.. అలానే నిద్ర కూడా అంతే అవసరం. అందుకే వారిని సౌఖ్యంగా ఉంచి నిద్రపుచ్చాల్సి ఉంటుంది. పసి పిల్లలు ఊపుని ఎక్కువగా ఇష్టపడతారు.

ఊయలలో ఊగుతూ వారు త్వరగా నిద్రపోతారు. ఒక్కోసారి వారికి చిరాకు కలిగినప్పుడు వారిని ఊరడించి నిద్రపుచ్చడం కష్టతరమవుతుంది. ఎక్కువ సేపు వారిని చేతులతోనూ, ఒడిలోనూ ఉంచడం మంచిది కాదు. అటువంటి సమయాలలో వారిని ఊయలలో వేసి నిద్రపుచ్చడం తేలిక అవుతుంది. అయితే.. బిడ్డ పుట్టగానే ఊయలలో వేయకూడదు. అందుకు తగిన ముహూర్తం నిర్ణయించి మంచి సమయంలో ఉయ్యాలలో పడుకోబెడుతుంటారు. ఈ వేడుకని బారసాల అని పిలుస్తారు.

బారసాలనే "నామకరణ డోలారోహణ" లేదా "నామకరణం" అని పిలుస్తారు. బారసాల అసలు పేరు బాల సారె. కాల క్రమంలో, వాడుకలో అది బారసాలగా మారింది.

బారసాలను ఎప్పుడు జరిపిస్తారు?

సాధారణంగా బిడ్డ పుట్టిన 11 వ రోజు, 16 వ రోజు, 21 వ రోజున జరిపిస్తారు. ఈ రోజుల్లో కుదరకపోతే మూడవ నెలలో జరిపిస్తారు. మూడవ నెలలో కూడా కుదరని వారు 29 వ నెలలో జరిపిస్తారు. సాధారణంగా వీలైనంత తొందరగా జరిపించడానికి ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఈ వేడుకకు పవిత్రమైన ముహుర్తాన్ని నిర్ణయించుకుని, సమీప ఆలయంలో లేదా ఇంటిలో జరుపుకుంటారు.

బారసాల రోజున ఏమి చేస్తారు?

ఆ రోజు బిడ్డకు స్నానం చేయించి, తల్లి తండ్రులు ఇద్దరు విఘ్నేశ్వర పూజ చేసి, పుణ్యావచనం చేస్తారు. ఆ తరువాత బిడ్డకు కటి సూత్ర ధారణ చేస్తారు. అనగా.. దిష్టి దోషాలు తగలకుండా బిడ్డకు మొలత్రాడు కడతారు. ఆ తరువాత అతని జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడతారు. లేదా వారికి నచ్చిన పేరుని అయినా పెట్టుకొనవచ్చును.

పళ్లెంలో బియ్యం పోసి అందులో వేలితో పేరు రాస్తారు. ఆ తరువాత పాలు, తేనే కలిపిన మిశ్రమంలో ఉంగరం ముంచి బిడ్డ నాలుకపై ఉంచుతారు. బిడ్డ తండ్రి పేరుని శిశువు చెవిలో మూడు సార్లు గుస గుసగా చెబుతాడు. శిశువు మేనమామ కూడా ఈ విధంగా చేస్తారు. ఆ తరువాత పెద్దలంతా చేరి పిల్లలు గొప్ప వ్యక్తులు కావాలని ఆశీర్వదిస్తారు.

పేరు పెట్టడం పూర్తి అయిన తరువాత ఆ బిడ్డని ఊయలలో పడుకోబెడతారు. కొందరు మహిళలు ఊయల చుట్టూ చేరి నిద్ర పుచ్చడానికి పాటలు పాడతారు. ఆ తరువాత అమ్మాయి తల్లి తండ్రులు కూతురు, అల్లుడు, పుట్టిన బిడ్డకి బట్టలు పెడతారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి పండు తాంబూలాలు ఇచ్చి పంపిస్తారు. అలాగే.. అదే రోజున సాయం సమయంలో బాలింతరాలి చేత బావిలో చేద వేయిస్తారు. అప్పటి వరకు ఆమె పనులు చేయకుండా ఉంటుంది. ఇక నుంచి ఆమె పనులు చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇలా ఆమె చేత బావిలో చేద వేయిస్తారు.

చివరగా..

ఈ వేడుక సరదాగా చేసుకునే వేడుక. బిడ్డ పుట్టిన ఆనందంలో కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకునే పండగ. వారి సంతోషాన్ని వ్యక్త పరుచుకుంటూ.. ఇంటిల్లిపాదీ కలిసి ఆహ్లాదంగా చేసుకునే వేడుక ఇది.

కొత్త అమ్మలు నమ్మే బారసాల సంరక్షణ సామగ్రి

మీ పసిబిడ్డ బారసాల వేడుకలో సౌఖ్యంగా, సురక్షితంగా ఉండేందుకు అవసరమైన మృదువైన ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

417 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Baby Wooden Cot with Rocker & Wheel

Baby Wooden Cot with Rocker & Wheel

264 Moms bought
₹7427₹1659955% Off
Rating
4.6
(17)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.