This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

పురుషుల్లో వంధ్యత్వాన్ని ఎదుర్కొనేందుకు మరియు గర్భధారణ అవకాశాలను పెంచేందకు డైట్ ప్లాన్ సహాయం చేస్తుందా?

Male Infertility
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
పురుషుల్లో వంధ్యత్వాన్ని ఎదుర్కొనేందుకు మరియు గర్భధారణ అవకాశాలను పెంచేందకు డైట్ ప్లాన్ సహాయం చేస్తుందా?
Likes3 Likes|
Read time6 min

పరిచయం

ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు బిడ్డను కనడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది రహస్యం కాదు. తరచూ ఈ సమస్య గురించి మనకు వినిపిస్తూ ఉంటుంది. వంధ్యత్వంతో పోరాడే జంటలలో 1/3వ వంతు జంటలు పురుషుల వీర్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది జీవనశైలి ఎంపికలు, ఆరోగ్య సమస్యలు, జన్యు సమస్యలు మొదలైన వాటి వల్ల కావొచ్చు. గర్భధారణ హామీ ఇచ్చే ఖచ్చితమైన పద్ధతి లేనప్పటికీ.. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అనేది గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది.

పురుషుల్లో వంధ్యత్వానికి గల కారణాలు

పురుషుల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ స్పెర్మ్ కౌంట్, తక్కువ స్పెర్మ్ నాణ్యత, హార్మోన్ల అసమతుల్యత మరియు పునరుత్పత్తి మార్గంలో అడ్డంకులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ కారణాలలో కొన్ని కారణాలు మన నియంత్రణలో లేనప్పటికీ, ఆహారం మరియు జీవనశైలి మార్పులను మెరుగుపరుచుకోవడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపర్చుకోవచ్చు. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​ను అనుసరించండం ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు న్యూట్రీషియన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పురుషులు మరియు స్త్రీల సంతానోత్పత్తికి ముఖ్యమైనది.

యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. మరియు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ముదురు ఆకుకూరలు, బెర్రీలు మరియు టమోటాలు మొదలైన ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి గురించి మిగతా బ్లాగులో వివరించబడింది.

ఫెర్టిలిటీ డైట్​ ప్లాన్​ను అనుసరించడంతో పాటుగా ఒత్తిడి స్థాయిలను మేనేజ్ చేసుకోవడం, చురుగ్గా ఉండడం వంటివి సంతానోత్పత్తిని పెంచుతాయి. వ్యాయామం అనేది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మరియు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ అలవాట్లు స్పెర్మ్ నాణ్యత మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి.

సంతానోత్పత్తిలో ఆహారం పాత్ర

చాలా మంది జంటలకు తెలిసిన విధంగా, గర్భం ధరించేందుకు ప్రయత్నించడం అనేది ఒక నిరాశపరిచే మరియు మానసికంగా కుంగదీసే ప్రక్రియ. గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్నపుడు వారు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నట్లు సులభంగా భావిస్తారు. వారు తాము తినే ఆహారం గురించి రెండోసారి ఆలోచిస్తారు. గర్భం దాల్చేందుకు అవకాశం ఉన్న ఆహారాలు ఇంకా ఏమైనా ఉన్నాయా (అవాయిడ్ చేయాల్సినవి) ఉన్నాయా? అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.

గర్భధారణకు హామీ ఇచ్చే ఏ మ్యాజిక్ ఫుడ్ లేనప్పటికీ సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని ఆహార ఎంపికలు ఉన్నాయి. వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... ప్రాసెస్ చేయబడిన మాంసాలు అయిన (బేకన్ మరియు సాసేజ్) తినే పురుషుల కంటే పౌల్ట్రీ మరియు చేపలు ఆహారంగా తినే వారిలో ఎక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇతర అధ్యయనాల ప్రకారం... ఎక్కువ కొవ్వులు ఉండే డెయిరీ ఉత్పత్తులు మహిళల్లో తక్కువ సంతానోత్పత్తి కలిగేలా చేస్తాయి.

సంతానోత్పత్తి కోసం తినాల్సిన ఆహారం

మీ ఫెర్టిలిటీ వెయిట్ లాస్ డైట్ ప్లాన్​లో చేర్చాల్సిన ఆహారాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి.

1. గుడ్లు: గుడ్లు ప్రొటీన్ ఉత్పత్తికి గొప్ప మూలం. పునరుత్పత్తి ఆరోగ్యం కోసం అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్​ను కలిగి ఉంటాయి.

2. సాల్మన్​: సాల్మన్​లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.

3. స్పినాచ్​ (బచ్చలికూర): బచ్చలికూరలో విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియంను కలిగి ఉంటుంది. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి.

4. నట్స్ మరియు సీడ్స్: నట్స్ మరియు సీడ్స్​లో జింక్, సెలెనియం మరియు విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు.

5. ఓట్స్: ఓట్స్ అనేవి ఫైబర్ యొక్క గొప్ప మూలం. ఇది హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో B విటమిన్ కూడా ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తి మరియు జీవక్రియకు ముఖ్యమైది.

సంతానోత్పత్తి కోసం తీసుకోకూడని ఆహారాలు

  • సోయా: సోయా అనేది సంతానోత్పత్తిని తగ్గించే కామన్ ఫుడ్. సోయా బీన్స్ మరియు సోయా ఆధారిత ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రోజెన్​లను కలిగి ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్​ను అనుకరిస్తాయి. మరియు గర్భధారణకు అవసరమైన హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.
  • కెఫిన్: కెఫిన్ అనేది సంతానోత్పత్తికి భంగం కలిగించే మరో మూలకం. కెఫిన్ వల్ల శరీరంలో ఒత్తిడి స్థాయిలు మరియు కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి రెండింటి పెరుగుదల వల్ల సంతానోత్పత్తి ప్రభావితం అవుతుంది.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేయబడిన ఆహారాలు సాధారణంగా సంతానోత్పత్తి కోసం అనారోగ్యకరమైనవి. (మొత్తం ఆరోగ్యానికి కూడా ఇవి మంచివి కావు) ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు, రసాయనాలు, మరియు శుద్ధి చేసిన చెక్కెరలు ఉంటాయి.
  • ఆల్కహాల్ వినియోగం కూడా స్పెర్మ్ క్వాలిటీ (నాణ్యత) మరియు క్వాంటిటీ (పరిమాణం) తో పాటుగా.. అండాశయ పనితీరును కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయడం లేదా పూర్తిగా మానేయడం చేయాలి.

సంతానోత్పత్తి కోసం సప్లిమెంట్స్

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​ తో పాటుగా అనేక విభిన్న సప్లిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవి పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని తేలింది. ప్రజాదరణ పొందిన కొన్ని ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.

1. CoQ10:

CoQ10 అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతతో పాటుగా చలనశీలతను పెంచడంలో కూడా సహాయపడుతుందని చూపబడింది.

2. L-కార్నిటైన్:

L-కార్నిటైన్ అనేది శక్తి ఉత్పత్తిలో పాల్గొనే ఒక అమైనో ఆమ్లం. ఇది కూడా స్పెర్మ్ నాణ్యతతో పాటుగా చలనశీలతను మెరుగుపరుస్తుందని చూపబడింది.

3. జింక్:

జింక్ అనేది మన శరీరంలోని అనేక ప్రక్రియలలో పాల్గొనే ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుందని మరియు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుందని చూపబడింది.

4. విటమిన్ C:

విటమిన్ C ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా టెస్టోస్టిరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది.

సంతానోత్పత్తి కోసం వ్యాయామం మరియు రిలాక్సేషన్ (ఒత్తిడిని తగ్గించే ప్రక్రియ)

గర్భధారణ కోసం హామీ ఇచ్చే మ్యాజిక్ వ్యాయామాలు ఏవీ లేవు. కానీ మితమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా ప్రతి వారం కొన్ని 30 నిమిషాల సెషన్స్ వ్యాయామం చేయాలి. రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా గర్భం దాల్చడంలో సహాయపడొచ్చు. పురుషులలో సడలింపు అనేది స్పెర్మ్ కౌంట్ మరియు చలనశీలతను పెంచేందుకు సహాయపడుతుంది. మహిళల్లో రిలాక్సేషన్ అనేది ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. తద్వారా హార్మోన్ల స్థాయిలు ప్రభావితం అయి.. ఒవొల్యూషన్ (అండోత్సర్గము) అవకాశాలను మెరుగుపరుస్తుంది.

చివరగా

పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరిచేందుకు సమతుల్య ఆహారం ఉపయోగపడుతుందని చెప్పేందుకు చాలా డేటా ఉంది. వంధ్యత్వ సమస్యలు ఎదుర్కొనే పురుషులు ఫెర్టిలిటీ బూస్టింగ్ డైట్ ప్లాన్ (సంతానోత్పత్తిని పెంచే డైట్ ప్లాన్) తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.