This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

తల్లైన కొత్తలో గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు (Top 5 Things Every New Mother Should Keep in Mind in Telugu)

Care of Mother Post Delivery
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Jan 29, 2026
తల్లైన కొత్తలో గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు (Top 5 Things Every New Mother Should Keep in Mind in Telugu)
Likes52 Likes|
Read time6 min

ఓ మహిళ ప్రసవానంతర కాలం డెలివరీ తర్వాత ప్రారంభమవుతుంది. గర్భవతి కాకముందు ఉన్నట్టుగా సాధారణ స్థితి వచ్చే వరకు ప్రసవానంతర కాలం కొనసాగుతుంది. ఈకాలం 6 వారాల నుంచి 8 వారాల మధ్య ఉంటుంది. ఈ సమయంలో మహిళలో శారీరక, భావోద్వేగ మార్పులు కనిపిస్తాయి. తల్లైన కొత్తలో బిడ్డ సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యతల దగ్గర్నుంచి తన శరీరంలో వచ్చే మార్పుల వరకు అనేక సవాళ్లు ఉంటాయి. వీటన్నింటి మధ్య ప్రసవం తర్వాత బరువు పెరగడం అనేది మరో అసలైన పోరాటంగా చెప్పాలి. అందుకే కొత్తగా తల్లైనవారంతా ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాలి.

1. సమతుల్యమైన, పోషకాహార డైట్ తప్పనిసరి (A Balanced and Nutritious Diet Is a Must in Telugu)

కొత్తగా తల్లి అయినవారికి సమతుల్యమైన, పోషకాహార డైట్ అవసరం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, చేపలు, చికెన్, తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే తల్లులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే, బిడ్డకు కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అందుకే, ప్రసవానంతరం బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ ఫాలో కావాలి. అందులో యోగర్ట్, చీజ్, లో-ఫ్యాట్ మిల్క్ లాంటివి ఉంటే క్యాల్షియం పుష్టిగా లభిస్తుంది. వీటితో పాటు ప్రసవానంతర వెయిట్ లాస్ డైట్‌లో ట్రౌట్, సాల్మన్ ఫిష్ లాంటి సూపర్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఈ ఆహారం తల్లులు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

కొత్త తల్లులు పాటించాల్సిన ప్రసవానంతర వెయిట్ లాస్ డైట్‌లో దలియా, బ్రౌన్ రైస్, ఓట్స్, తృణ ధాన్యాల లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహరాపదార్థాలు కూడా ఉండాలి. ఇది జీర్ణక్రియను మందగించేలా చేసి ఆకలి బాధల్ని తగ్గిస్తుంది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, ఆకలిని తగ్గిస్తుంది. కేలరీలు తీసుకోవడం తగ్గడంతో పాటు, కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వైట్ బటర్, ఆవ నూనె, నెయ్యి లాంటివి తీసుకుంటే శక్తి రావడంతో పాటు చర్మానికి, శిరోజాలకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇవి అతిగా తీసుకోకూడదు.

2. సరైన సమయంలో తినడం కీలకం (Eating at the Right Time Is Crucial)

కొత్తగా తల్లైనవారు ఒక్కోసారి భోజనం చేయడం మానేస్తుంటారు. ఇది జీవక్రియను గందరగోళంలో పడేయ్యడమే కాకుండా, ప్రసవానంతరం బరువు తగ్గే ప్రక్రియకు ఇబ్బందిగా మారుతుంది. పిల్లల బాగోగులు చూసుకోవాల్సి ఉన్నా, వీలైనంత త్వరగా తినడం తప్పనిసరి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు తినొచ్చు. ఎక్కువసేపు ఆకలితో ఉండటం మంచిది కాదు. ఆ తర్వాత ఆకలి తట్టుకోలేక మరింత ఎక్కువగా తినే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడంలో ఇబ్బందులుంటాయి. కొత్త తల్లులు ఎక్కువగా తింటే సరైన పోషకాలు కూడా అందవు. ఇంకా కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే చిప్స్ ప్యాకెట్స్‌ని పండ్లతో, డ్రైఫ్రూట్స్‌తో, నట్స్‌తో రీప్లేస్ చేయాలి. జీవక్రియను మెరుగుపర్చడానికి ఆరోగ్యకరమైన ఆప్షన్స్ చూడాలి.

3. హైడ్రేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు (Hydration Should Not Take the Back Seat )

ప్రసవానంతరం బరువు తగ్గడానికి టిప్స్ పాటించే తల్లులు తప్పనిసరిగా హైడ్రేట్ అవుతూ ఉండాలి. శరీరంలో వేడిని తగ్గించడానికి కావాల్సినన్ని నీళ్లు తాగాలి. శరీరంలో ఎక్కువ కేలరీలు కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్నాక్స్ తీసుకునేముందు నీళ్లు తప్పనిసరిగా తాగాలి. కడుపు నిండుగా అనిపించి జంక్ ఫుడ్ తక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిల్లల సంరక్షణలో ఉన్న తల్లులు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రొమ్ము పాలల్లో 90 శాతం నీళ్లే ఉంటాయి. పరిశోధన ప్రకారం రోజూ 16 గ్లాసుల నీళ్లు తాగిన పాలిచ్చే తల్లులు వారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. మూత్రం రంగు, వాష్‌రూమ్‌కు ఎన్ని సార్లు వెళ్లారు అనేదానిపై తీసుకోవాల్సిన నీటి గురించి నిపుణులు సిఫార్సులు చేస్తున్నారు. కావాల్సినంత ద్రవపదార్థాలు తీసుకున్న కొత్త తల్లుల్లో మూత్రం క్లియర్‌గా ఉంటుంది. 3 నుంచి 4 గంటలకు ఓసారి వాష్‌రూమ్‌కు వెళ్తారు. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, తాజా పళ్ల రసాలు, వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు.

4. కాస్త వ్యాయామం తప్పనిసరి (Move It)

ప్రసవానంతరం బరువు తగ్గడానికి డైట్ మాత్రమే కాదు, కొత్తగా తల్లైనవారు స్ట్రెంత్ ట్రైనింగ్, ఏరోబిక్ వ్యాయామాలను కూడా తమ షెడ్యూల్‌లో చేర్చాలి. దీని వల్ల బరువు తగ్గడం మాత్రమే కాకుండా, సరైన వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్, నిద్ర సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. ప్రసవం తర్వాత మంచి షేప్ కోసం జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా కండరాలకు పనిచెప్పొచ్చు. గుండె పంపింగ్ చేయొచ్చు. యోగా, ధ్యానం, డ్యాన్సింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లాంటివాటితోనూ బరువు తగ్గొచ్చు. కానీ ఏ వర్కవుట్ ప్రారంభించాలన్నా ముందుగా వైద్యుల ఆమోదం తప్పనిసరి. ముఖ్యంగా సీ-సెక్షన్‌లో డెలివరీ చేయించుకున్న మహిళలు వైద్యుల సలహా తీసుకోవాలి.

5. నిద్ర విషయంలో రాజీ పడొద్దు (Do Not Compromise on Sleep)

ప్రసవానంతరం బరువు తగ్గడానికి టిప్స్‌లో మంచి నిద్ర తప్పనిసరిగా ఉంటుంది. నిద్రలేమి వల్ల ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గడం కష్టం. దీంతోపాటు, వారు నిరంతరం అలసిపోయి ఉంటారు కాబట్టి మంచి నిద్రతో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అందులో బరువు పెంచే కార్టిసాల్ హార్మోన్ కూడా ఉంటుంది. అందుకే కొత్త తల్లులకు నిద్ర అనేది కీలకంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే 8 గంటలు క్వాలిటీ స్లీప్ దొరకడం కష్టం కానీ, పిల్లలు నిద్రపోతున్నంత సేపు తల్లులు కూడా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు, రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కునుకు తీయాలి. ఎక్కువ సేపు నిద్రపోయేందుకు రాత్రి త్వరగా పడుకోవాలి.

చివరగా ఓ మాట (It’s a Wrap)

బిడ్డకు జన్మనివ్వగానే ఆ మహిళ చంద్రునిపైకి వెళ్లినంతగా ఆనందిస్తుంది. కానీ శిశువుతో పాటు తన గురించి కూడా పట్టించుకోవడం ఆమె బాధ్యత. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. అయితే ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తుంటారు. ఏ సందేహం ఉన్నా వైద్యుల సలహా తీసుకోవాలి. వీటితో పాటు కొత్తగా తల్లైన వారు మయిలో వెబ్‌సైట్‌లో ఉన్న ఆర్టికల్స్, ఇతర రీసోర్సెస్ చూసి అవసరమైన సమాచారం, టిప్స్ పొందొచ్చు.

Tags:

Keep in mind these things, tips for new moms in telugu, Top 5 Things Every New Mother Should Keep in Mind in English, Top 5 Things Every New Mother Should Keep in Mind in Hindi, Top 5 Things Every New Mother Should Keep in Mind in Bengali, Top 5 Things Every New Mother Should Keep in Mind in Tamil.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.