


Pregnancy
29 January 2026 న నవీకరించబడింది
గర్భధారణ అనేది తరచుగా మహిళలకు అసౌకర్యాలకు గురిచేసే దశ, ఈ సమయంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు అనేది అటువంటి సమస్యే. స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ఇంకా శరీర బరువు పెరుగుతుంది. ఇది కాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది, అందువల్ల గర్భధారణ సమయంలో వచ్చే కాళ్ళ వాపుకు అది దారితీస్తుంది.
గర్భధారణ సమయంలో గర్భవతుల పాదాలు ఇంకా వేళ్లలో వాపును గమనిచవచ్చు. గర్భవతుల శరీరంలో మామూలు స్థాయి కంటే ఎక్కువగా నీటిని కలిగి ఉన్నప్పుడు గర్భధారణ వచ్చే కాళ్ళ వాపు సాధారణంగా కనబడుతుంది. శిశువు ఎదుగుతున్నప్పుడు, గర్భాశయ బరువు కూడా పెరుగుతుంది. పెరిగిన బరువువల్ల, అది వారి పాదాలు ఇంకా కాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాక, దీనివల్ల రక్త ప్రసరణ తగ్గడంతో, శరీరంలో ద్రవాల పరిమాణం పెరిగిపోయి, అది పాదాలు ఇంకా కాళ్ళలో వాపుకు కారణమవుతుంది.
గర్భధారణ సమయంలో కాళ్లలో వాపు సాధారణం, ఇంకా దానిని తక్షణమే నయంచేసుకోలేరు. అయితే, ఈ వాపును తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గర్భధారణలో కాళ్ళలో వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడే కొన్ని టిప్స్ క్రింద ఉన్నాయి:
గర్భవతులు ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవాలి, నిలబడినప్పుడు వారి పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. వారు కూర్చుని విశ్రాంతి తీసుకొనేందుకు కాస్త సమయాన్ని కేటాయించుకోవాలి ఇంకా విశ్రాంతి తీసుకునేటప్పుడు వారు తమ పాదాలను పైకి కాస్త ఎత్తులో ఉంచాలి. వారు తమ పాదాలను చీలమండల వద్ద సున్నితంగా తిప్పవచ్చు ఇంకా పాదాలను వంచడం ద్వారా వారి కాళ్ళ పిక్కల కండరాలను స్ట్రెచ్ చేయవచ్చు. పాదాలను కొంచెం ఎత్తులో పెట్టి పడుకోవడం కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో కాళ్ళ వాపును తగ్గించడానికి మహిళలకు సహాయపడగలవి ఈ కంప్రెషన్ మేజోళ్ళు. వాపు నుండి ఉపశమనం పొందడానికి రోజంతా సపోర్టివ్ టైట్స్ ఇంకా మేజోళ్ళు ధరించాలి. మోకాలి వరకు ఉండే మేజోళ్ళు వాపును మరింత తీవ్రతరం చేస్తాయని గమనించాలి.
కాళ్ల వాపులను అదుపులో ఉంచుకొనేందుకు శరీరంలో కొంత కదలిక ఉండటం అవసరం. వారి కాలి కండరాలు పనిచేస్తూ ఉండేలా చిన్నపాటి నడకలు ఇంకా అప్పుడప్పుడు సైక్లింగ్ చేయాలి. కొలనులో కొంతసేపు ఈత కొట్టడం కూడా వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక, గర్భవతులు తమ కాళ్ళలో వాపు నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని ఫుట్(పాదాల) వ్యాయామాలు చేయవచ్చు.
గర్భవతులు కాలిలో ఉండే పరమహాసిరపై ఒత్తిడిని తగ్గించి, వారి పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుచుకొనేందుకు ఎడమ వైపున తిరిగి పడుకోవాలి. ఈ సిర శరీరంలోని దిగువ భాగం నుండి రక్తాన్ని గుండెకు తీసుకువెళుతుంది. దీనిపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక దిండును ఉపయోగించి వారు తమ పాదాలను కూడా ఎత్తులో ఉంచుకోవచ్చు.
ఎక్కువగా నీటి తీసుకోవడం వల్ల గర్భవతులు వారి శరీరంలోని అధికమైన ద్రవాలని వదిలించుకోవచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాపుకు కారణమయ్యే ఈ ద్రవాలని నీళ్ళు భర్తీ చేస్తాయి, తద్వారా పాదాలలో వాపు తగ్గుతుంది.
శరీరం నుండి అదనపు ద్రవాలను తొలగించడానికి సోడియం తీసుకోవడం తగ్గించడం ఒక ఉత్తమ మార్గం. ఇలా చేయాలంటే, క్యాన్డ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. రోజ్ మేరీ, ఒరేగానో మరియు థైమ్ వంటి వాటిని ఉప్పుకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.
కెఫిన్ ఒక డైయూరెటిక్(మూత్రవిసర్జన ఎక్కువ చేసే) పదార్ధం, అంటే ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది శరీరాన్ని ద్రవాలను అట్టిపెట్టుకొనేలా చేస్తుంది, అందువల్ల వాపులు తీవ్రమవుతాయి. కాఫీకి బదులుగా డికాఫ్ కాఫీని ప్రయత్నించవచ్చు లేదా కావలసిన శక్తిని పెంచుకొనేందుకు కాఫీని హెర్బల్ టీతో భర్తీ చేయవచ్చు.
గర్భధారణ సమయంలో వచ్చే కాళ్ళ వాపును తగ్గించడానికి పాదాల వ్యాయామం సహాయపడుతుంది. ఇది పాదాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. పాదాల వాపు నుండి ఉపశమనం పొందేందుకు మహిళలు చేయవలసిన కొన్ని పాద వ్యాయామాలు-
గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు అనేది అతి సాధారణ విషయం, మరియు దాని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. పిండం ఎదుగుదలకు తోడ్పడటానికి శరీరంలో అదనపు ద్రవాలను ఉత్పత్తి అవడం అనేది వాపు వచ్చే ప్రాథమిక కారణాలలో ఒకటి. కాళ్ళలో వాపుకు కారణాలు ఒక త్రైమాసికం నుండి మరొక త్రైమాసికానికి మారుతూ ఉండవచ్చు.
వీటితో పాటు, గర్భధారణ సమయంలో పాదాలలో వాపుకు కారణమయ్యే కొన్ని ఇతర కారణాలు, తీసుకొనే ఆహారంలో అసమతుల్యత, పెరిగిన కెఫిన్ వాడకం, డిహైడ్రెషన్ ఇంకా చుట్టూ ఉన్న వేడి వాతావరణం. కాబట్టి గర్భధారణ సమయంలో కాళ్లలో వచ్చే వాపు గురించి మహిళలు తెలుసుకోవలసిన అన్ని అంశాలు ఇవి. వారి కాళ్లలో వాపుకు దారితీసే అన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఇంకా వాపును తగ్గించుకొనేందుకు పైన తెలిపిన టిప్స్ అనుసరించాలి.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips






Top 8 Cloth Diapering Myths in Telugu: క్లాత్ డైపరింగ్ అపోహలు!

రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం మంచి ఐడియాలు (Endearing Ideas for Second Pregnancy Photoshoot in Telugu)

పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా (Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Telugu)?

గర్భధారణ సమయంలో తాటి ముంజలు: ప్రయోజనాలు ఇంకా ప్రమాదాలు | Ice Apple During Pregnancy in Telugu

10 వారాల గర్భం ఎన్నవ నెల అవుతుంది ఇంకా మీకు ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఏమిటి?

పసిపిల్లలకు చలికాలపు దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి బట్టలను పరిగణనలోకి తీసుకోవాలి?

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |