hamburgerIcon
login
STORE

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article continues after adveritsment

  • Home arrow
  • Baby Care arrow
  • మీ శిశువుని ఇంకా పసిబిడ్డని సంతోషకరంగా ఎలా పెంచాలి : పుట్టుక నుండి 12 నెలల వరకూ arrow

In this Article

    మీ శిశువుని ఇంకా పసిబిడ్డని సంతోషకరంగా ఎలా పెంచాలి : పుట్టుక నుండి 12 నెలల వరకూ

    Baby Care

    మీ శిశువుని ఇంకా పసిబిడ్డని సంతోషకరంగా ఎలా పెంచాలి : పుట్టుక నుండి 12 నెలల వరకూ

    3 November 2023 న నవీకరించబడింది

    Article continues after adveritsment

    విషయం:

    పసిపిల్లలు తమ అవసరాలను లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు అటూ ఇటూ కదలటం లేదా ఆకలిగా ఉన్నప్పుడు నోటిని తెరుస్తూ మూస్తూ ఉండటం వంటి సంకేతాల ద్వారా తెలియచేస్తారు. ఒకవేళ వాటిని మీరు పట్టించుకోకపోతే, వారు ఏడవటం ప్రారంభిస్తారు. పరిశోధనల ప్రకారం, మీ పాప/బాబు ఒత్తిడి పడి ఏడ్చేముందే మీరు వాని అవసరాన్ని గ్రహించి తీర్చినట్లయితే, అది వారిలో అంతర్గతంగా సౌకర్యాన్ని పెంచుతుంది. వారు సంరకించబడుతున్నారు అనే అనే విశ్వాసంతో ప్రశాంతమైన మెదడు నిర్మించబడేలా చేస్తుంది.

    మీ పసిబిడ్డ ఆనందకరంగా ఎదగటానికి మీరు ఎలా సాయపడాలి

    1. డిటెక్టివ్ గా మారండి

    మీ పిల్లలు అప్పుడే మాట్లాడలేరు కాబట్టి మీరే మీ బిడ్డకి అసహనం, చికాకు కలిగించే విషయాలని పరిశోధన చేసి తెలుసుకోవాలి. మురికిగా మారిన డైపర్ లేదా వారి వంటిపై ఏదైనా బట్టల భాగం వారికి చికాకుని కలిగిస్తోందా అని వారి శరీరం మొత్తాన్ని చెక్ చేసి చూడండి. వారికి కొంత ఉపశమనం అందించటానికి కాసేపు మసాజ్ లేదా గోరువెచ్చని నీటితో స్నానం కూడా ప్రయత్నించవచ్చు.

    2. హత్తుకోవడం ఇంకా వెన్నంటి చూసుకోవటం

    మీ బేబీని నెమ్మదిగా వెన్నుతడుతూ, బుజ్జగిస్తూ లాలించండి. ఇది వారి శరీరంలో సంతోషకర హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ ను ఉత్పత్తి చేయడానికి ప్రేరణనిచ్చి, వారికి సురక్షితమనే భావనని అందిస్తుంది. అంతేకాదు పాపాయిని ముద్దుచేస్తూ దగ్గరగా హత్తుకుని పడుకోవటం, కౌగిలించుకోవడం మీలో సంతోషానిచ్చే హార్మోన్లని ప్రేరేపిస్తాయి కూడా.

    3. మీ బిడ్డ దృష్టివైపు నుండి కూడా గమనించండి

    పెద్దవారిలా అప్పుడే పుట్టిన పిల్లలలో సంభాషణా నైపుణ్యాలు ఉండవు కాబట్టి, వారి ప్రాథమిక అవసరాల కోసం చాలామటుకు వారు చికాకులో కంగారుపడుతూ, ఏడుస్తూ ఉండాల్సి వస్తుంది.

    ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, వారి అవసరాలు తీరుతున్నాయా లేదా వారికి ఇబ్బందులేమైనా ఉన్నాయా? అని మీరే అనుక్షణం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.

    వారి కొద్దిగా ఏడవనివ్వండి

    మీ చిన్నారి ఎదుగుతున్నప్పుడు, పాకడం, నడవటం, కూర్చోడం లేదా పాలు తాగటం ఇలాంటి పనులలో పాప/బాబు ఎప్పుడో అప్పుడు అవి సరిగ్గారాక బాధపడటం అనివార్యం. అలాంటప్పుడు కొద్దిసేపు ఏడవటం కూడా సరైన అభివృద్ధికి అవసరమే. మీ పాప లేదా బాబుకి ముఖ్యమైన విషయాల్లో ఒకటి తను మొట్టమొదటిసారి నడిచినప్పుడు తన సామర్థ్యం మీద గర్వం, తృప్తి పడగలగటం. అలా వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటే, జీవితంలో ఎదురయ్యే సవాళ్లని కూడా ధైర్యంగా ఎదుర్కోగలరు.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Article continues after adveritsment

    Article continues after adveritsment

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.