Breastfeeding & Lactation
3 November 2023 న నవీకరించబడింది
వాస్తవానికి, అమ్మగా మీ ప్రయాణం ఎంతో సుదీర్ఘంగా సాగే ప్రయాణమని ఆందోళనకరంగా అన్పించవచ్చు! నిజానికి, ఉద్యోగం చేస్తున్న అమ్మలు చాలామంది వారి పసికందులకి ఆహారంగా సాధారణంగా వారి పాలని ఇవ్వటానికి ఎలక్ట్రిక్ లేదా చేతితో పనిచేసే మాన్యువల్ బ్రెస్ట్ పంప్ లపై ఆధారపడతారు. చేత్తో పనిచేసే మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ విషయానికొస్తే, వాటి నుండి పాలని ఎవరైనా చాలా సౌకర్యవంతంగా సేకరించగలరు. అదీగాక, మాన్యువల్ బ్రెస్ట్ పంప్ మొత్తంగా పాల పరిమాణాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది, ఆ విధంగా మీ బేబీ ఎదగడంలో సాయపడుతుంది!
మీరు పాలు పట్టడం అయిపోయాక, మీ రెండు స్తనాల నుండి మాన్యువల్ గా చేత్తోనే తల్లిపాలని పంప్ చేయవచ్చు. అలా మళ్ళీ వచ్చేసారికి రెండు స్తనాలలో పాలు పూర్తిగా అయిపోయి ఉంటాయి. నెమ్మదిగా మీ శరీరానికే సరైన సమయానికి ఎక్కువ పాలని ఉత్పత్తి చేయాలనే సిగ్నల్ అందుతుంది. నిజానికి సమయంతోపాటు, చేత్తో మాన్యువల్ పంపింగ్ ద్వారా తల్లులు రోజు మొత్తంమీద కూడా పాల ఉత్పత్తి పెరగడం ఆశించవచ్చు.
మీరు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ని ఎలా వాడాలో మరింత తెలుసుకోవటానికి, ఇంకా మీ స్తనాల నుండి ఎక్కువ పాలని ఎలా సేకరించాలో తెలుసుకోవటానికి, కింద సూచించిన టిప్స్ ని పాటించడానికి ప్రయత్నించండి!
1. చేతితో పంపింగ్ మొదలుపెట్టేముందు మీ స్తనాలని మసాజ్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోండి. నేరుగా మీరు పాల్గొని చేసే పంపింగ్ ప్రక్రియ మీ స్తనాలని దీనికి సిద్ధం చేయటంలో సాయపడుతుంది.
2. వెచ్చదనంతో ప్రయోగాలు చేయండి.
3. సీసాల నుండి మీ దృష్టిని మరల్చుకోండి. ఆ విధంగా మీరు మెరుగైన విశ్రాంతిని పొందుతారు.
4. సరైన సైజులో బ్రెస్ట్ షీల్డులని కొన్నారని నిర్థారించుకోండి. మరీ బిగుతుగా ఉండే లేదా మరీ వదులుగా ఉండే బ్రెస్ట్ షీల్డు పంపింగ్ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది.
5. పంపింగ్ భాగాలని తరచుగా మారుస్తున్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి.
6. మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ని వాడుతున్నట్లయితే, వాక్యూమ్ బలాన్ని కావాల్సినదానికి అనుగుణంగా సరి చేసుకుంటున్నారో లేదో చూసుకుంటూ ఉండండి.
పైన చెప్పిన చిట్కాలని పాటిస్తూ, మీరు పంపింగ్ ప్రక్రియని ఆరామంగా మార్చుకోవచ్చు! మీరు మేటి మాన్యువల్ బ్రెస్ట్ పంప్ ని కొనేముందు, కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవటం ముఖ్యం. మొదటగా, తప్పకుండా మంచి నాణ్యమైనదే కొనండి! రెండవది, అమ్మే వ్యాపారికి ప్రభుత్వ అనుమతి ఉండి తీరాలి. నిజానికి దీర్ఘకాలంలో ఒక మాన్యువల్ బ్రెస్ట్ పంప్ కొనడం లాభదాయకమైనదనే చెప్పవచ్చు!
ఇక మీరు ఇప్పుడు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ సాయంతో ఎంత పాలని సేకరించగలరని ఊహిస్తున్నారా? తన బిడ్డకి క్రమం తప్పకుండా తల్లిపాలనే ఇచ్చే తల్లికి, ప్రతిసారీ పంపింగ్ సమయంలో 2 ఔన్సుల పాలు పంపింగ్ ద్వారా ఉత్పత్తి కావచ్చు. కానీ, మీరు తగినంత పాలని పంప్ చేయలేకపోతున్నట్లయితే, అది పంపింగ్ సరిగ్గా చేయకపోవటమో లేదా ఏదో ఇంకా బయటపడని సమస్య వలనో అయివుంటుంది.
పాలు ఉత్పత్తి అవటానికి చాలా సమయం ముందే మీరు పంప్ చేయడం మొదలుపెట్టేస్తే, కొద్ది పాలే ఉత్పత్తి అవటం లేదా అసలు పాలే రాకపోవటం జరగవచ్చు. ఇలా ఎందుకంటే ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే కొలోస్ట్రం వలన పంపు చేయటం కష్టం కావచ్చు. అలా సమయంతోపాటు నెమ్మదిగా, మీ స్తనాలు తగినంత పాలని ఉత్పత్తి చేయలేకపోయే సమస్యని కూడా ఎదుర్కొంటారు.
పంపింగ్ సమయంలో మీ పాల సరఫరా క్రమం తప్పకుండా ఉండాలని అనుకుంటే, మీరు ప్రతి రెండు గంటలకి ఒకసారి మాన్యువల్ బ్రెస్ట్ పంపుని వాడటం ప్రయత్నించవచ్చు. అలా కాలంతోపాటు మీ పాల ఉత్పత్తి పెరగవచ్చు. మామూలుగా అయితే మీ పాలని, ముఖ్యంగా పగటిపూట ప్రతి మూడు గంటలకోసారి పంపు చేయమని సూచిస్తారు.
తల్లులు పంపులో ఎంత ఎక్కువ వాక్యూమ్ బలం ఉంటే అంత ఎక్కువగా పాలు సేకరించబడతాయి అనుకోవటం సాధారణమే. కానీ, మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యవిషయం ఏంటంటే, అంత ఎక్కువ ఒత్తిడి వద్ద పంపింగ్ చేస్తున్నప్పుడు అది మీ శరీరం తగినంత పాలని ఉత్పత్తి చేసే శక్తికి అడ్డంకి కావచ్చు.అందుకని, బ్రెస్ట్ పంపు యొక్క సెట్టింగులని తదనుగుణంగా సర్దుబాటు చేయండి. భారతదేశంలో మేటి మాన్యువల్ బ్రెస్ట్ పంపు విషయానికి వస్తే,అందులో తల్లులు వారికి తగ్గట్టు పాలని సేకరించే శక్తిని మార్చుకోవచ్చు.
పంపింగ్ ప్రక్రియని ప్రారంభించే ముందు, మీరు సౌకర్యవంతంగా కూర్చోటానికి ప్రయత్నించండి. పంపింగ్ సమయంలో మీరు రిక్లైనర్లో ఏటవాలుగా పడుకోవచ్చు కూడా. మీ వీపుకి తగినంత సపోర్టు ఉండేలా కూర్చోండి. మీ నడుము వద్ద దిండ్లు పెట్టుకోవచ్చు. అలా పంపింగ్ సమయంలో కూర్చున్నప్పుడు మీ పొట్ట, వీపులపై అదనపు ఒత్తిడి తగ్గుతుంది.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |