


Getting Pregnant
3 November 2023 న నవీకరించబడింది
గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా ఫైబ్రాయిడ్లు స్త్రీ గర్భాశయంలో పెరిగే క్యాన్సర్‌కు కారణం కాని కణతులు. ఈ ఫైబ్రాయిడ్లు(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) సాధారణంగా ప్రసవ సమయానికి దగ్గర పడుతున్న స్త్రీలలో కనిపిస్తాయి. అంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో కనిపిస్తాయి. కానీ ఇవి ఏ వయసు స్త్రీలలోనైనా సంభవిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాల గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే కొంత మంది స్త్రీలు ఎటువంటి లక్షణాలు లేకున్నా కానీ గర్భాశయ ఫైబ్రాయిడ్(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు)తో బాధపడుతున్నారు. అదే సమయంలో కొంత మంది స్త్రీలు అధికంగా పీరియడ్స్, తీవ్రమైన వెన్ను నొప్పి, మరియు సెక్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లేదా లియోమయోమాస్ లేదా ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్‌కు కారణం కాని గడ్డలు. ఇవి గర్భాశయ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇవి బంధన కణజాలాలు మరియు కండరాలతో తయారు చేయబడతాయి. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) చాలా అరుదుగా గర్భాశయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఫైబ్రాయిడ్లు వివిధ పరిమాణాల్లో సంభవిస్తాయి. ఇవి మనిషి కన్ను గుర్తించలేని చిన్న సైజ్ నుంచి గర్భాశయ పరిమాణాన్నే మార్చగల భారీ సైజ్ వరకు ఉంటాయి. గర్భాశయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫైబ్రాయిడ్లు ఉండవచ్చు. ఈ ఫైబ్రాయిడ్లు సాధారణంగా పెల్విక్ పరీక్ష లేదా ప్రినేటల్ అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించబడతాయి. వీటిని గుర్తించిన తర్వాత వివిధ రకాల వైద్య విధానాలను అనుసరించి వీటికి చికిత్స చేయవచ్చు.
గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాలు ఒక స్త్రీ నుంచి మరో స్త్రీకి మారుతూ ఉంటాయి. కొంత మంది తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటే.. మరికొంత మంది మాత్రం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలు కొన్ని ఈ కింది విధంగా ఉంటాయి.
గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌తో (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) బాధపడే స్త్రీలు వివిధ రకాల గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలను ఎదుర్కొంటారు. ఇందులో చాలా రకాలు బాధాకరంగా ఉంటాయి. కంటికి కనిపించనంత చిన్న గర్భాశయ ఫైబ్రాయిడ్లను కలిగి ఉన్న స్త్రీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాదు. పెద్ద ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలు వెన్నులో మరియు పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పిని కలిగి ఉండడం సహజం. కొంత మంది స్త్రీలు సెక్స్ చేస్తున్నపుడు నొప్పి, గర్భాశయంలో సూదులతో గుచ్చినట్లు ఉండే పదునైన నొప్పులను కూడా అనుభవించచ్చు. పరిస్థితి మరింత దిగజారితే కొందరికి రుతుచక్ర సమయంలో తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. పీరియడ్స్ క్రమరహితంగా ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో ఎక్కువ కాలం పాటు పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ తిమ్మిరి ఎంతకాలం పాటు ఉంటుందో ఎవరూ చెప్పలేరు.
వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షకులు గర్భాశయ ఫైబ్రాయిడ్లను రెగ్యులర్ పెల్విక్ పరీక్షల్లో గుర్తిస్తారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలను మొదట గుర్తించిన తర్వాత ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేదా? అని పూర్తిగా తెలుసుకునేందుకు కింది రకాల పరీక్షలను సూచించవచ్చు.
స్త్రీ శరీరంలో పెరిగే గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌ను (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) మేనేజ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) మేనేజ్మెంట్ అనేది వాటి పరిమాణం, సంఖ్య మరియు అవి ఎక్కడ ఏర్పడ్డాయనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకునేందుకు మీ వైద్య సంరక్షుడిని సంప్రదించాలి.
గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) కు రెండు రకాలుగా చికిత్స చేయొచ్చు.
ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) నివారించేందుకు సాధారణంగా సిఫారసు చేసే కొన్ని మందులు..
ఫైబ్రాయిడ్లను తొలగించేందుకు అత్యంత ప్రతిభావంతమైన శస్త్ర చికిత్సా పద్ధతులు ఉన్నాయి.
స్త్రీ శరీరంలో ఫైబ్రాయిడ్లు(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) పెరగకుండా ఆపేందుకు ఎటువంటి మార్గం లేదు. కానీ ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడం మరియు సమతుల పద్ధతిలో ఆహారం తీసుకోవడం వంటి జీవనశైలిలో మార్పుల వలన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. శరీరంలో గర్భాశయ ఫైబ్రాయిడ్ల పెరుగుదలను తగ్గించేందుకు కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎవరైనా గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే పెల్విక్ టెస్ట్ కోసం వారి వైద్య సంరక్షకుడిని సంప్రదించాలి.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |