
గర్భధారణ సమయంలో మహిళల్లో సాధారణంగా ప్రీఎక్లాంప్సియా మరియు ఇతర అనారోగ్యాలు తలెత్తడం సహజం. అందువల్ల గర్భధారణ సమయంలో వారిలో చాలా మందికి ఆస్ప్రిన్ లేదా ఎకోస్ప్రిన్ 75 ను తక్కువ మోతాదులో సూచిస్తారు. గర్భం మొదటి త్రైమాసికంలో గర్భస్త మహిళ ప్రతి రోజు ఈ మందులను తీసుకోవాల్సి ఉంటుంది.
ఎకోస్ప్రిన్ 75 (ఎకోస్ప్రిన్ 75)ను తీసుకోవడం వల్ల గర్భం యొక్క కొన్ని దశలలో ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది మీ శిశువు ఆరోగ్యకరమైన డెలివరీకి, వారు మంచి బరువుతో జన్మించేందుకు సహకరిస్తుంది. దీని వలన ప్రీఎక్లాంప్సియా దుష్రభావాలు మీ మీద పడవు. ఇటీవలే గర్భధారణలో మీకు ఎకోస్ప్రిన్ ను సూచించినట్లయితే దాని యొక్క మరిన్ని ఫలితాలను తెలుసుకునేందుకు మీరు తప్పనిసరిగా ఈ ఆర్టికల్ చదవడం కొనసాగించండి.
ప్రీఎక్లాంప్సియా అనేది తల్లితో పాటు బిడ్డకు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారుతుంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఇది పిల్లలలో అనేక లోపాలకు దారి తీస్తుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. తక్కువ మోతాదులో రోజువారీగా ఆస్ప్రిన్ను తీసుకోవడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా భవిష్యత్లో గర్భధారణకు సంబంధించి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రయోజకరంగా ఉంటుంది.
బీపీ పెరిగే అవకాశాలు, అంతే కాకుండా రెండో త్రైమాసికంలో మూత్రంలో అవసరమైన పోషకాలు వెళ్లిపోవడం వంటి ప్రీఎక్లాంప్సియా యొక్క కొన్ని లక్షణాలు. ఇటువంటి సంకేతాలు కనుక కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయకండి. అమెరికాలో (US) 4శాతం గర్భాలు ప్రీఎక్లాంప్సియా సమస్యలను కలిగి ఉన్నాయి. ఇంకా జీర్ణించుకోలేని నిజం ఏమిటంటే.. ప్రీఎక్లాంప్సియా వల్ల అమెరికా (U.S)లో అనేక మంది గర్భవతులు గర్భస్రావం వంటి ఇతర గర్భధారణ సమస్యలను కూడా అనుభవిస్తున్నారు.
ప్రీఎక్లాంప్సియా అనేది అకాల డెలివరీకి(రోజులు నిండకముందే డెలివరీ కావడం) దారి తీస్తుంది. అందుకోసమే ప్రీఎక్లాంప్సియా రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపులో శిశువు 34 వారాల సమయం ఉండకముందే జన్మిస్తే శిశువుకు అధిక ప్రమాదం ఉంటుంది. ప్రాణాంతక సమస్యలతో పాటు, అవయవాలు చెడిపోవడం, శిశువుకు ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలన్నీ శిశువు ముందే పుట్టేలా చేస్తాయి. అంతే కాకుండా స్ట్రోక్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
కడుపులో ఉన్న బిడ్డ నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి.. బిడ్డను మోస్తున్న తల్లి ప్రీఎక్లాంప్సియాతో బాధపడుతుంటే.. మీ బిడ్డ నెలలు నిండకుండానే పుట్టే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో తల్లి ప్రాణాలను కాపాడేందుకు చాలా మంది వైద్యులు ముందుగానే ప్రసవం చేసి బిడ్డను బయటకు తీస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో ఈ పరిస్థితి గుండెపోటు (స్ట్రోక్)కు దారితీస్తుంది. ప్రీఎక్లాంప్సియా డెవలప్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్న స్త్రీలు కింది పరిస్థితులను కలిగి ఉంటారు.
అంతే కాకుండా మీరు కింద పేర్కొన్న కేటగిరీల్లో ఏదైనా కేటగిరీకి చెంది ఉంటే.. మీరు తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ను తీసుకోవాలని మీ వైద్యుడు సిఫారసు చేసే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ 150 ని తీసుకోవడం వలన ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదాన్ని 14 శాతం మేర తగ్గించవచ్చు. అంతే కాకుండా ఆస్ప్రిన్ను తక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా సురక్షితంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకునే ముందు తమ వైద్యుడితో మాట్లాడాలి.
మీరు ముందుగా మీ వైద్యుడిని సంప్రదించకుండా ఆస్ప్రిన్ను తీసుకోవడం ప్రారంభించకూడదు. ఎందుకంటే ఎకోస్ప్రిన్ యొక్క అధిక పరిమాణం కొంత మందిలో ప్రాణాంతక సమస్యలను కూడా కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే.. మీ సొంత ప్రయోగాలు(సొంత వైద్యం) చేయకపోవడమే ఉత్తమం. మరీ ముఖ్యంగా మీరు గర్భవతిగా ఉన్న సమయంలో ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇవి బిడ్డతో పాటుగా తల్లి మీద కూడా ప్రభావం చూపుతాయి. సాధారణంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్న గర్భవతులకు ఎకోస్ప్రిన్ ను సిఫారసు చేయరు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కొన్ని వైద్య పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలకు ఇది సిఫారసు చేయబడుతుంది.
ప్రతి రోజు 60 నుంచి 100 mg వరకు ఎకోస్ప్రిన్ ను తీసుకోవడం సురక్షితం. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆస్ప్రిన్ను ప్రతి రోజు తీసుకుంటారు. గర్భాన్ని కోల్పోవడం, రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చే సమస్యలు, అంతే కాకుండా ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. మీ గర్భధారణ వయసు (ప్రెగ్నెన్సీ ఏజ్)ను బట్టి అధిక మోతాదులో ఆస్ప్రిన్ను తీసుకోవడం అనేది మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
మీరు కనుక మీ మొదటి త్రైమాసికంలో ఉంటే… గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం అనేక దుష్పలితాలకు దారి తీస్తుంది. ఇలా చేయడం వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మీ మూడో త్రైమాసికంలో ఆస్ప్రిన్ను అధిక మోతాదులో తీసుకోవడం వలన నెలలు నిండకముందే పుట్టడం, లేదా పుట్టబోయే శిశువు గుండెనాళాలు మూసుకుపోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంది. తద్వారా మరింత ప్రమాదకర పరిస్థితికి ఇది దారి తీస్తుంది. మీరు ఎకోస్ప్రిన్ ను ఎక్కువ కాలం నుంచి తీసుకుంటూ ఉంటే.. మీకు పుట్టబోయే శిశువు మెదడు రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఒక వేళ మీకు మూడో త్రైమాసికంలో ఎకోస్ప్రిన్ వేసుకోమని మీ వైద్యుడు సూచిస్తే.. వారు మిమ్మిల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.
అధిక మోతాదులో ఆస్ప్రిన్ను తీసుకోవడం వలన కూడా కొన్ని సందర్భాల్లో శిశువులో మూత్రపిండాల సమస్యను కలిగిస్తుంది. ఇది శిశువు చుట్టూ ఉన్న ఆమ్నియోటిక్ ద్రవం స్థాయిని తగ్గించి.. పరిస్థితిని మరింత జఠిలం చేస్తుంది. అందువల్ల 19 వారాల గర్భం పూర్తయిన తర్వాత ఆస్ప్రిన్ను తీసుకోవడాన్ని FDA (ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతించదు. గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
మీరు ఇప్పటికే ఎకోస్ప్రిన్ 75 ను తీసుకుంటుంటే.. నియమావళిని అలాగే కొనసాగించండి. మీకు ఏవైనా అసాధారణ లక్షణాలు ఉంటే.. నిశితంగా గమనించండి. అలా కాకుండా మీరు ఎకోస్ప్రిన్ 75 తో పాటుగా ఇతర మందులను కూడా తీసుకుంటూంటే.. ఆ మందుల గురించి మీ వైద్యుడికి తెలుసునని నిర్దారించుకోండి. తల్లి మరియు బిడ్డకు ఎటువంటి సమస్యలు లేవని మీరు నిర్దారించుకోవాలని అనుకుంటే మీరు వరుసగా వైద్యుడితో అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవాలని అనుకోవచ్చు. ఒకవేళ మీ శరీరం ఆస్ప్రిన్కు అనుకూలంగా లేకుంటే మీ వైద్యుడు మీకు మీ ఆరోగ్య స్థితిని బట్టి టైలెనాల్ లేదా ఇతర మందులను సిఫారసు చేయొచ్చు.
చివరగా..
గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మీరు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీ శరీరం భిన్నంగా స్పందిస్తే.. మీరు వెంటనే మందులను ఆపేసి వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. గర్భం యొక్క ప్రారంభ దశలలో లేదా గర్భం యొక్క చివరి దశలలో కూడా మీరు ఎకోస్ప్రిన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. సాధారణంగా ఎక్కువ మంది మహిళలు మొదటి త్రైమాసికంలో లేదా మూడో త్రైమాసికంలో ఎకోస్ప్రిన్ ను ఉపయోగిస్తారు.
ఒక గర్భవతి మూడో త్రైమాసికంలో ఎకోస్ప్రిన్ వాడడం ప్రారంభిస్తే.. ఆమె తన వైద్యుడితో నిశితంగా పరీక్ష జరిపించుకోవాల్సి ఉంటుంది. మొదటి త్రైమాసికంలో కనుక ఎక్కువ ఆస్ప్రిన్ను తీసుకుంటే గర్భం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మూడో త్రైమాసికంలో ఎక్కువ ఆస్ప్రిన్ను తీసుకోవడం వలన అనుకున్న సమయం కంటే ముందుగానే శిశువు పుట్టే అవకాశం ఉంది. అందువల్లే మీరు ఇది ప్రారంభించే ముందు వైద్యుడితో మాట్లాడడం ఉత్తమం. సరైన మోతాదును వారు సూచిస్తారు.
Yes
No


















Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |