Raise A Happy & Healthy Baby
Get baby's growth & weight tips
Join the Mylo Moms community
Get baby diet chart
Get Mylo App
Want to raise a happy & healthy Baby?
In Vitro Fertilization (IVF)
20 June 2023 న నవీకరించబడింది
నేటి ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడితో, చాలా మందికి హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య ఎదురవుతోంది. అది వంధ్యత్వానికి దారి తీస్తుంది. అటువంటి సందర్భాలలో, వైద్యులు IVF చికిత్స చేయించుకోమని దంపతులకు సిఫార్సు చేయవచ్చు. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ అని కూడా పిలువబడే IVF స్త్రీలు గర్భవతి కావడానికి సహాయపడుతుంది. IVF ప్రక్రియలో స్పెర్మ్ మరియు గుడ్డు స్త్రీ శరీరం వెలుపల ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెందుతాయి.
IVF అనేది స్త్రీని గర్భవతిని చేయడానికి ఒక కృత్రిమ ప్రక్రియ. ఇది ఒక జైగోట్‌ను ఉత్పత్తి చేయడానికి గుడ్డు మరియు శుక్రకణాలను కృత్రిమంగా సంగమనం చేసే ప్రక్రియ. జైగోట్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యడానికి సిద్ధమైన తర్వాత, గర్భవతిగా ప్రకటించబడిన స్త్రీ లోపల ఉంచబడుతుంది. స్త్రీ సాధారణంగా IVF మందులను తీసుకుంటుంది కాబట్టి ఆమె శరీరం గర్భాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉంటుంది.
IVF క్రింది సందర్భాలలో సూచించబడుతుంది:
గర్భాన్ని శాశ్వతంగా తీసివేయడానికి ట్యూబల్ లిగేషన్ అని పిలువబడే ప్రక్రియలో ఫెలోపియన్ ట్యూబ్‌లు కత్తిరించబడతాయి లేదా నిరోధించబడతాయి. మీ ట్యూబ్‌లు కట్టివేయించుకున్న తర్వాత మీరు గర్భవతి కావాలనుకుంటే ట్యూబల్ లిగేషన్ రివర్సల్ సర్జరీ కంటే IVF ఉత్తమ ఎంపిక.
ఫెలోపియన్ ట్యూబ్‌కు అడ్డుదల ఉన్నప్పుడు లేదా దానికి గాయం అయినప్పుడు, గుడ్డు ఫలదీకరణం చెందడం లేదా పిండం గర్భాశయానికి వెళ్లడం సవాలుగా మారుతుంది. అటువంటి సందర్భంలో, IVF సిఫార్సు చేయబడుతుంది.
ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయంలో ఉండే నిరపాయమైన కణితులు. 30 మరియు 40 ఏళ్లలోపు మహిళల్లో ఇవి చాలా సాధారణం. ఫైబ్రాయిడ్లు ఫలదీకరణం చేసిన గుడ్డు సరిగ్గా అమరకుండా నిరోధించవచ్చు.
అండోత్సర్గము అప్పుడప్పుడు జరగడం లేదా అసలు జరగక పోయినట్లయితే ఫలదీకరణం కోసం తక్కువ గుడ్లు అందుబాటులో ఉంటాయి.
అనేక కారణాల కోసం పరీక్షించినప్పటికీ ఏ కారణం వళ్ళ పిల్లలు కలగడం లేదో తెలియనప్పుడు దాన్ని వివరించలేని వంధ్యత్వం అంటారు.
మీరు మీ సంతానోత్పత్తిని ప్రభావితం చేసే క్యాన్సర్ చికిత్సను ప్రారంభించబోతున్నట్లయితే IVF ఒక ఎంపికగా ఉండవచ్చు. స్త్రీలు తమ అండాశయాలను గుడ్ల కోసం హార్వెస్ట్ చేసుకొని, వాటిని తర్వాత వాడకం కోసం ఫలదీకరణం చేయకుండా స్తంభింపజేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, గుడ్లు ఫలదీకరణం చేసి కూడా స్తంభింపజేయవచ్చు.
స్పెర్మ్ కి తక్కువ సాంద్రత , పరిమిత కదలిక (పేలవమైన చలనశీలత) లేదా పరిమాణం మరియు రూపంలో అసాధారణతలు కలిగి ఉంటే, గుడ్డును ఫలదీకరణం చేయడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. వీర్యంలో అసాధారణతలు కనుగొనబడినట్లయితే వంధ్యత్వ నిపుణుడితో సంప్రదించడం అవసరం అవుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో ఆలస్యంగా గర్భం దాల్చడం : కారణాలు మరియు లక్షణాలు
గర్భాశయ లైనింగ్ ఇంప్లాంట్‌లను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల వ్యాపించినప్పుడు ఈ పరిస్థితి కలుగుతుంది. ఈ పరిస్థితి తరచుగా అండాశయాలు, గర్భాశయం మరియు ఫెలోపియన్ ట్యూబ్‌లను దెబ్బతీస్తుంది.
మీరు లేదా మీ జీవిత భాగస్వామి మీ బిడ్డకు జన్యుపరమైన పరిస్థితిని ప్రసరింపజేసే ప్రమాదం ఉన్నట్లయితే మీరు IVFకి అర్హులు. అన్ని జన్యుపరమైన సమస్యలు గుర్తించబడనప్పటికీ, గుడ్లు సంగ్రహించిన మరియు ఫలదీకరణం చేసిన తర్వాత నిర్దిష్ట జన్యుపరమైన సమస్యల కోసం పరీక్షలు చేయబడతాయి. ఎటువంటి సమస్యలు లేని పిండాలను గర్భాశయంలోకి ఉంచవచ్చు.
IVF అనేది ఎక్కువ దశల్లో జరిగే సవాలైన ప్రక్రియ. ఇది సగటున నాలుగు నుండి ఆరు వారాలు పడుతుంది. ఇది గుడ్డును తీసే ముందు కాలం నుండి ప్రెగ్నెన్సీ టెస్ట్ నిర్ధారించబడే వరకు కలిగి ఉంటుంది. సంతానోత్పత్తి సమస్యలు లేదా ఒక జంటకు ముందుగానే ఉన్న వైద్య పరిస్థితి వంటి వివిధ కారణాల వల్ల ప్రజలు IVFని ఎంచుకుంటారు. కొంతమంది వ్యక్తులు మునుపటి సంతానోత్పత్తి చికిత్సలు వారికి పని చేయకపోయినా లేదా వారు 35 ఏళ్లు పైబడినట్లయితే IVFని పరిగణిస్తారు. స్వలింగ జంటలకు కూడా IVF ఒక ఆచరణీయ ప్రక్రియ.
భారతదేశంలో IVF చికిత్స ఖర్చు
భారతదేశంలో IVF ధర రూ. 1 నుండి 3 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు, హార్మోన్లు, మందులు, కన్సల్టేషన్ ఛార్జీలు, ప్రక్రియ మరియు తదుపరి చర్యలు ఉంటాయి.
ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ అంటే స్త్రీ శరీరం వెలుపల మగ స్పెర్మ్ మరియు ఆడ గుడ్డు యొక్క కృత్రిమ గర్భధారణ. సహజంగా పిల్లలను పొందలేని జంటలు, స్వలింగ జంటలు లేదా ఒంటరి తల్లిదండ్రులు ఈ విధానాన్ని అవలంబిస్తారు. స్పెర్మ్ లేదా అండం దంపతుల సొంతం లేదా దాత ఇచ్చినది కావచ్చు. దాత విషయంలో దాత వివరాలు పూర్తిగా అజ్ఞాతంగా ఉంచబడతాయి. మీరు IVF గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఈరోజే మీ వైద్యుడిని సంప్రదించండి .
Yes
No
Written by
swetharao62
swetharao62
పైలనైడిల్ సిస్ట్ అంటే ఏమిటి? కారణాలు, చికిత్స & లక్షణాలు
గర్భధారణ సమయంలో సోంపు గింజలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, వాటి పోషకవిలువల గురించి తెలుసుకోండి!
గర్భధారణ సమయంలో ఎండు ద్రాక్ష (ప్రూనే) తినడం వలన కలిగే ప్రయోజనాలు మరియు ప్రమాదాలు!
గర్భధారణ సమయంలో పచ్ఛళ్లు | ప్రయోజనాలు & ప్రమాదాలు
గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం | ప్రయోజనాలు & దుష్ప్రభావాలు
కడుపుతో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినడం: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
Skin brightening | Acne & Blemishes | Skin hydration | Dark Circles | Blackheads & Pimples | Skin Moisturizer | Skin Irritation | Shop By Ingredient | Kumkumadi | Ubtan | Vitamin C | Tea Tree | Aloe Vera | Rose Water | Skin - Hair | SHOP BY CONCERN | Hairfall | Dry and Damaged Hair | Hair Growth | Shop By Ingredient | Cloth Diaper | Maternity dresses | Stretch Marks Kit | Stroller |