Pregnancy
12 December 2022 న నవీకరించబడింది
గర్భధారణలో ఆలస్యం అనేది విస్తృతంగా చర్చలో ఉన్న అంశం. ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్నత ఆశయాలతో సాగే మహిళల్లో లేట్ ప్రెగ్నెన్సీపై చర్చ సాగుతుంది. ముప్పై ఏళ్ళ తర్వాత గర్భం దాల్చడం గురించి చాలా మంది ఆందోళన చెందుతారు. ఈ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిద్దాం. అలాగే అపోహలను తొలగించేందుకు ప్రయత్నిద్దాం.
గత దశాబ్దాలతో పోలిస్తే ఈ రోజుల్లో మహిళలు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. బాలికలకు వివాహం చేసుకునేందుకు సాధారణ వయస్సు సుమారు 22 సంవత్సరాలు. అయితే ఇప్పుడది 27 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకు పెరిగింది. కుటుంబ నియంత్రణ, గర్భధారణ అనేవి ఆ తర్వాత వస్తాయి. ముప్పైలలో ప్రసవించే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఒక మహిళ తన ముప్పైలలో గర్భం ధరించినప్పుడు ఏర్పడే వైద్యపరమైన ఇబ్బందులను తొలగించడానికి ఆమె తన గర్భధారణను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవాలి. సెల్ఫ్ కేర్ ఎంతో అవసరమైన ఈ దశలో ఆమె సరైన డైట్ ఫాలో చేయాల్సి ఉంటుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ధూమపానం మానేయడం, అలాగే మద్యం సేవించడం మానేయడం మంచిది.
● గర్భస్రావం
● పుట్టుకతో వచ్చే లోపాలు
● కవలలు (దీనిని కొంతమంది రిస్క్ లేదా సమస్యగా పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. కొందరు అందుకు భిన్నంగా ఉండవచ్చు)
● అధిక రక్తపోటు
● గర్భధారణ మధుమేహం
● కష్టతరమైన ప్రసవం
ఎక్కువ వయస్సు ఉన్న గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం (ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్) కు ఎక్కువ అవకాశం ఉంది. మహిళలందరికీ గర్భధారణ జరిగాక మొదటి మూడు నెలలు (దీనిని మనం మొదటి ట్రైమెస్టర్ అని పిలుస్తాం) చాలా క్లిష్టమైనవి.
లేట్ ప్రెగ్నెన్సీలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండవచ్చు. మహిళల వయస్సు పెరిగే కొద్దీ క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. తప్పిపోయిన, దెబ్బతిన్న లేదా అదనపు క్రోమోజోమ్‌లతో బిడ్డకు జన్మనిచ్చే ప్రమాదం ఉంది.
30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు తరువాత ఒకటి కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీలకు కూడా అవకాశం ఉంది. కారణం ఏమిటంటే వయస్సు పెరిగే కొద్దీ అండాశయాలు ప్రతి నెలా ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసార్లు మల్టిపుల్ ప్రెగ్నెన్సీల కారణంగా నెలలు నిండక ముందే లేదా అకాల జననం (ప్రీమెచ్యూర్ బర్త్ లేదా ప్రీటర్మ్) అయ్యే ప్రమాదం ఉంది.
ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ సమస్యగా మారింది. మీరు 25-30 సంవత్సరాల వయస్సులో లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో గర్భం ధరించినా.. ఇది అన్ని వయస్సుల వారికి సర్వసాధారణంగా మారింది. అందువల్ల మీరు లేట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఉప్పు తీసుకోవడంపై అదనపు శ్రద్ధ వహించాలి. ఉప్పు వాడకం మీరు గర్భం దాల్చిన రోజు నుండి తగ్గుతూపోవాలి.
లేట్ ప్రెగ్నెన్సీలో ఒక వ్యక్తి ఎదుర్కొనే మరొక సంక్లిష్టత గర్భధారణలో మధుమేహం. వయసైన మహిళలకు ఇది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. దీని కోసం మీరు గర్భవతి కావడానికి ముందు ఫాలో కావాల్సిన డైట్ గురించి మంచి ప్రసూతి వైద్యులు లేదా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
డౌన్ సిండ్రోమ్ కూడా ఆలస్యంగా పిల్లలను కన్నప్పుడు ఎదురయ్యే అత్యంత సాధారణ క్రోమోజోమ్ సమస్యలలో ఒకటి.
● గర్భధారణలో ఇబ్బంది - 30ల ప్రారంభంలో మహిళలు గర్భధారణకు తక్కువ అనుకూలంగా ఉంటారు. వారు గర్భవతి కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
● గర్భధారణ సమయంలో సంక్లిష్టతలు - 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వయసైన మహిళలకు ఒకటి కంటే ఎక్కువ పిండాలు (మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్) ఏర్పడే అవకాశం ఉంది.
● డెలివరీ సమయంలో సంక్లిష్టతలు - సిజేరియన్ ద్వారా బిడ్డ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సు తరువాత తమ మొదటి బిడ్డను కలిగి ఉన్న మహిళలు దీర్ఘకాలిక ప్రసవం వంటి ఇతర డెలివరీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గర్భవతి అయ్యే అవకాశాలు ౩౦ సంవత్సరాల వద్ద తగ్గడం ప్రారంభిస్తాయి. మహిళల వయసు పెరిగితే అండాశయాలలో అండాల సంఖ్య తగ్గుతుంది. తద్వారా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం.. 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 100 మంది గర్భం దాల్చగల మహిళలు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తే.. 1 సైకిల్ లో కేవలం 20 మంది మాత్రమే విజయవంతం అయ్యారు. ఇతరులు మళ్లీ ప్రయత్నించాల్సి వచ్చింది.
జీవనశైలిలో మార్పులు, ప్రాధాన్యతలతో లేట్ ప్రెగ్నెన్సీ సాధారణం అవుతోంది. ఒక బిడ్డను పెంచే బాధ్యతను తీసుకోవడానికి లేదా స్థిరపడటానికి ముందు మహిళలు తమ కెరీర్ లక్ష్యాలను కొనసాగించాలని, జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. రానురాను 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో లేట్ ప్రెగ్నెన్సీలు సాధారణం అవబోతున్నాయి.
కాబట్టి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారం పట్ల శ్రద్ధ వహించకుండా 30 సంవత్సరాల వయస్సులో గర్భధారణను ప్లాన్ చేస్తుంటే.. మీరు ఆరోగ్యకరమైన గర్భధారణ లేదా ఆరోగ్యకరమైన బిడ్డను కలిగి ఉండటం కష్టం. మీ ప్రసూతి వైద్యుడు-గైనకాలజిస్ట్‌ని సంప్రదించిన తరువాత మీరు ప్రీనాటల్ టెస్టింగ్‌కు కూడా వెళ్లవచ్చు.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
సెక్స్ తర్వాత గర్భధారణను ఎలా నివారించాలి?
ప్రెగ్నెన్సీ సమయంలో రొమ్ము పాలు కారకుండా ఎలా ఆపాలి?
సహజసిద్ధంగా గర్భం దాల్చేందుకు వీర్యాన్ని బలంగా ఎలా తయారు చేయాలి?
ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ నివేదికను ఎలా చదవాలి
గర్భధారణ కొత్తలో శృంగారం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు
నెలసరిలో మీరు ఇంటిమేట్ వాష్ ఉపయోగించవచ్చా ?
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Trusted by 10+ million young parents Mylo is India’s #1 Pregnancy & Parenting App. Mylo app will guide you through your whole parenting journey. Download now
Maternity Dresses | Stretch Marks Cream | Stretch Marks Oil | Pregnancy Pillow | Kashmiri Saffron | Bra Extenders | Post Pregnancy Belt | Feeding Bra | Maternity Leggings | Maternity Care Products | Maternity Panty | C Shaped Pregnancy Pillow | Maternity Wear | Maxi Dresses | Kaftan Dresses | Midi Dresses | Mom Care Products - SHOP BY CONCERN | Nursing Products | Pregnancy Support Products | STRETCH MARKS |