Baby Care
24 May 2023 న నవీకరించబడింది
తల్లిదండ్రులు తరచుగా తమ బిడ్డ రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఈ "టెర్రీబుల్ టూస్" అనే దశ మొదలవుతుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి, ఈ దశ బిడ్డలో 18 నెలల వయస్సు ఉన్నప్పుడు ప్రారంభమై, దాదాపు మూడు సంవత్సరాల నిండే వరకు ఉంటుంది. ఈ దశలో తమ పిల్లలకు సరైన సంరక్షణ అందించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి, అంతే తప్ప ఆందోళన పడకూడదు.
ఈ టెర్రీబుల్ టూస్ దశ పిల్లలలో కొన్ని తీవ్రమైన ప్రవర్తనా మార్పులను తీసుకువస్తుంది కాబట్టి అది అలా పిలవబడుతోంది. తల్లిదండ్రులు గమనించే అత్యంత సాధారణ మార్పులు మొండితనంతో పాటు అల్లరి చేయడం పెరగడం ఇంకా మానసిక అస్థిరత. ఏ పరిస్థితిలోనైనా ఈ ప్రవర్తనా మార్పులు అకస్మాత్తుగా కనబడటం మూలాన చాలా మంది తల్లిదండ్రులు ఇలాంటివి ముందే ఊహించి ఉండరు. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన గురించి నలుగురిలో ఇబ్బంది పడవలసి వస్తుంది. వారు తమ పిల్లల ప్రవర్తనను మార్చలేకపోతున్నామని లేదా అప్పటికప్పుడే వారిని అలా ప్రవర్తించకుండా ఆపలేమని కూడా వారు తెలుసుకుంటారు.
"టెర్రీబుల్ టూస్" దశలో తల్లిదండ్రులు తమ పిల్లలలో గమనించదగ్గ కొన్ని ప్రవర్తనా మార్పులు:
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలు మారాం చేయడానికి కారణాలు ఏమిటి?
తల్లిదండ్రులు తరచుగా వారి శిశువైద్యుడిని ఈ టెర్రీబుల్ టూస్ దశ ఎప్పుడు మొదలవుతుందని అడుగుతుంటారు? ఆ దశలో తమ పిల్లల ప్రవర్తనను ఎదుర్కొనేందుకు చక్కగా సిద్ధం కావడానికి వారు తమ సందేహాన్ని అడుగుతారు. కానీ దురదృష్టవశాత్తు, పిల్లల కోసం "టెర్రీబుల్ టూస్" దశ ఎప్పుడు ప్రారంభమవుతుందో సూచించడానికి నిర్దిష్ట సమయ సూచీ ఏదీ లేదు. పిల్లలలో ఈ దశ, వారు ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పటి నుండి మొదలయ్యీ, మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రవర్తనా మార్పులను గమనించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి, తద్వారా వారు వాటిని చక్కగా ఎదుర్కోవడంలో అవి సహాయపడతాయి.
సాధారణంగా, మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మొండిగా ప్రవర్తించడం, అల్లరి చేయడం ఇంకా వారు మానసిక అస్థిరతను కలిగి ఉండటం సహజం. ఎందుకంటే అటువంటి వయస్సు పిల్లలు సాధారణంగా పరిమిత పదజాలల జ్ఞానాన్ని కలిగి ఉంటారు అంతేకాక, వారి భావాలను సరైన రీతిలో వ్యక్తపరచలేరు. బిడ్డ వయసు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఇంకా అల్లరి, మొండితనం అలాగే ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు ఈ విషయాల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ప్రవర్తనా సమస్యలను సూచించే కొన్ని నిర్దిష్ట సంకేతాలు ఇవి కావొచ్చు:
పిల్లలందరూ "టెర్రీబుల్ టూస్" దశ గుండా వెళతారు, కానీ ప్రతి తల్లిదండ్రులు ఇందులోని భిన్నమైన అనుభవాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు సహజంగానే ఇతరుల కంటే మెరుగ్గా మామూలుగా మారుతారు, దానివల్ల వారిలో అసహనం తగ్గుతుంది. కొంతమంది పిల్లలు ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉండి, త్వరగా అసహనానికి ఇంకా నిరుత్సాహానికి లోనుకారు. అటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఈ దశ అంతగా బాధించదు, కానీ ఇతరులకు ఇది అలా ఉండకపోవచ్చు.
తల్లిదండ్రులు పిల్లల వైద్యులను అడిగే మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే - టెర్రీబుల్ టూస్ దశ ఎప్పుడు ముగుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం గమ్మత్తైనది. చాలా మంది పిల్లలు మూడు సంవత్సరాల వయస్సులోపు మాటలను సరిగ్గా పలకడం నేర్చుకుంటారు. కాబట్టి వారు తమను తాము బాగా వ్యక్తీకరించుకోగలరు, ఇది అసహనం ఇంకా కోపం కలిగించే సందర్భాలను తగ్గిస్తుంది. ఈ పిల్లలలో మునుపటి కంటే తక్కువగా అలక బూనడం ఉంటుంది. కానీ కొన్నిసార్లు, పిల్లలు పెద్దయ్యాక కూడా ఇలాగే అసహనం అలకలు కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఇది అలవాటుగా మారకముందే పిల్లల తల్లిదండ్రులు పరిస్థితిని చక్కదిద్దాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి?
"టెర్రీబుల్ టూస్" దశలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గాడిన పెట్టేందుకు సహాయపడే కొన్ని పనిచేసే టిప్స్ ఇవి:
తల్లిదండ్రులు తమ పిల్లలలో అసాధారణ ప్రవర్తనను గమనించినట్లయితే నిపుణుల సహాయం తీసుకోవాలి. పిల్లలు శారీరక హింసా ప్రవృత్తిని చూపినట్లయితే ఆరోగ్య పరమైన సమస్యలున్నాయేమో తెలుసుకొనేందుకు వైద్యపరమైన పరీక్షలు అవసరం.
"టెర్రీబుల్ టూస్" అనేది బాల్యంలో ఎదురయ్యే ఒక దశ మాత్రమే. తల్లిదండ్రులు దాని గురించి ఆందోళన చెందకుండా వారి పిల్లల వికాసం ఇంకా ఆరోగ్యంపై దృష్టి సారించాలి.
Yes
No
Written by
dhanlaxmirao
dhanlaxmirao
ప్లాసెంటాను తినడం సురక్షితమేనా? అసలు ప్లాసెంటాని ఎందుకు తింటారు?
ప్లేసిబో అంటే ఏంటీ? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి?
మైండ్‌ఫుల్ పేరెంటింగ్: పద్ధతులు & ప్రయోజనాలు
శిశువు కడుపు మీద నిద్రపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయంలో ఎటువంటి సలహాలు పాటించాలి?
రెండో త్రైమాసికం ఫీటల్ అనోమలి స్కాన్ టెస్ట్: మీ ప్రెగ్నెన్సీ సమయంలో దీనివల్ల ఏమి తెలుస్తుంది?
ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు - లక్షణాలు & మేనేజ్మెంట్
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Dry and Damaged Hair | Shop By Ingredient | Onion | Aloe Vera Range For Hair | Coconut | Neelibrigandi | Skin - Bath & Body | By Ingredient | Skin - Pregnancy & New Mom | Skin - Health & Wellness | Digestive Health | Lactation | Pain management | By Ingredient | Saffron | Shatavari | Nivarini | Skin - Weight | Weight Management | By Ingredient |