hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Getting Pregnant arrow
  • గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు): అర్థం, కారణాలు & నివారణలు arrow

In this Article

    గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు): అర్థం, కారణాలు & నివారణలు

    Getting Pregnant

    గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు): అర్థం, కారణాలు & నివారణలు

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా ఫైబ్రాయిడ్లు స్త్రీ గర్భాశయంలో పెరిగే క్యాన్సర్​కు కారణం కాని కణతులు. ఈ ఫైబ్రాయిడ్లు(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) సాధారణంగా ప్రసవ సమయానికి దగ్గర పడుతున్న స్త్రీలలో కనిపిస్తాయి. అంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో కనిపిస్తాయి. కానీ ఇవి ఏ వయసు స్త్రీలలోనైనా సంభవిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాల గురించి చెప్పేందుకు పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే కొంత మంది స్త్రీలు ఎటువంటి లక్షణాలు లేకున్నా కానీ గర్భాశయ ఫైబ్రాయిడ్​(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు)తో బాధపడుతున్నారు. అదే సమయంలో కొంత మంది స్త్రీలు అధికంగా పీరియడ్స్, తీవ్రమైన వెన్ను నొప్పి, మరియు సెక్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు.

    గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) అంటే ఏమిటి?

    గర్భాశయ ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లేదా లియోమయోమాస్ లేదా ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్​కు కారణం కాని గడ్డలు. ఇవి గర్భాశయ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇవి బంధన కణజాలాలు మరియు కండరాలతో తయారు చేయబడతాయి. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) చాలా అరుదుగా గర్భాశయ క్యాన్సర్​కు దారితీస్తాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఫైబ్రాయిడ్లు వివిధ పరిమాణాల్లో సంభవిస్తాయి. ఇవి మనిషి కన్ను గుర్తించలేని చిన్న సైజ్ నుంచి గర్భాశయ పరిమాణాన్నే మార్చగల భారీ సైజ్ వరకు ఉంటాయి. గర్భాశయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫైబ్రాయిడ్లు ఉండవచ్చు. ఈ ఫైబ్రాయిడ్లు సాధారణంగా పెల్విక్ పరీక్ష లేదా ప్రినేటల్ అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించబడతాయి. వీటిని గుర్తించిన తర్వాత వివిధ రకాల వైద్య విధానాలను అనుసరించి వీటికి చికిత్స చేయవచ్చు.

    గర్భాశయ ఫైబ్రాయిడ్స్: సంకేతాలు & కారకాలు:

    గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాలు ఒక స్త్రీ నుంచి మరో స్త్రీకి మారుతూ ఉంటాయి. కొంత మంది తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటే.. మరికొంత మంది మాత్రం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలు కొన్ని ఈ కింది విధంగా ఉంటాయి.

    • హెవీ పీరియడ్స్
    • పీరియడ్స్ సాధారణంగా వారం రోజుల పాటు ఉంటాయి
    • తరచుగా మూత్రవిసర్జన
    • స్థిరంగా ఉండే మలబద్దకం
    • వెన్ను మరియు కాలు నొప్పి
    • సెక్స్ చేసేటపుడు తీవ్రమైన నొప్పి
    • దీర్ఘకాలిక యోని ఉత్సర్గ
    • ఉబ్బరం
    • "గర్భాశయ ఫైబ్రాయిడ్లు పెరిగేందుకు కారణం ఏమిటి?". అనే ప్రశ్నకు సమాధానం లేదు. అయినప్పటికీ కొన్ని పరిశోధనలు మరియు వైద్యపరంగా చేసిన అధ్యయనాల ప్రకారం గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వచ్చేందుకు కిందివి కారణం అని నమ్ముతారు.
    • జన్యు మార్పులు
    • ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత
    • శరీరంలో కణజాలాలు సరైన విధంగా పెరిగేలా చూసుకునే పదార్థాలు ఈ ఫైబ్రాయిడ్ల పెరుగుదలకు కూడా కారణం అవుతాయి.
    • శరీర కణజాలాలను బంధించే బాధ్యత వహించే ఎక్స్​ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ కూడా ఈ ఫైబ్రాయిడ్స్ పెరిగేందుకు కారణం అవుతాయి. శరీరంలోని సాధారణ కణాల కంటే ఫైబ్రాయిడ్ కణాలు ఎక్కువ ఎక్స్​ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ కలిగి ఉంటాయి.

    గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) నొప్పి ఎలా అనిపిస్తుంది?

    గర్భాశయ ఫైబ్రాయిడ్స్​తో (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) బాధపడే స్త్రీలు వివిధ రకాల గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలను ఎదుర్కొంటారు. ఇందులో చాలా రకాలు బాధాకరంగా ఉంటాయి. కంటికి కనిపించనంత చిన్న గర్భాశయ ఫైబ్రాయిడ్లను కలిగి ఉన్న స్త్రీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాదు. పెద్ద ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలు వెన్నులో మరియు పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పిని కలిగి ఉండడం సహజం. కొంత మంది స్త్రీలు సెక్స్ చేస్తున్నపుడు నొప్పి, గర్భాశయంలో సూదులతో గుచ్చినట్లు ఉండే పదునైన నొప్పులను కూడా అనుభవించచ్చు. పరిస్థితి మరింత దిగజారితే కొందరికి రుతుచక్ర సమయంలో తిమ్మిర్లు కూడా ఉండవచ్చు. పీరియడ్స్ క్రమరహితంగా ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో ఎక్కువ కాలం పాటు పీరియడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ తిమ్మిరి ఎంతకాలం పాటు ఉంటుందో ఎవరూ చెప్పలేరు.

    గర్భాశయ ఫైబ్రాయిడ్లను ఎలా నిర్దారణ చేయవచ్చు?

    వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షకులు గర్భాశయ ఫైబ్రాయిడ్లను రెగ్యులర్ పెల్విక్ పరీక్షల్లో గుర్తిస్తారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ లక్షణాలను మొదట గుర్తించిన తర్వాత ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేదా? అని పూర్తిగా తెలుసుకునేందుకు కింది రకాల పరీక్షలను సూచించవచ్చు.

    Article continues below advertisment

    • అల్ట్రాసౌండ్: ఈ స్క్రీనింగ్ పరీక్షలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు ఏ ప్రదేశంలో ఉన్నాయి మరియు ఎంత సైజులో ఉన్నాయని తెలుసుకునేందుకు పరీక్ష నుంచి పొందిన చిత్రాన్ని ఉపయోగిస్తారు.
    • MRI టెస్ట్: అల్ట్రాసౌండ్ పరీక్ష ఫలితాలు అసంపూర్తిగా ఉన్నపుడు ఫైబ్రాయిడ్ ద్వారా ప్రభావితమైన ప్రాంతం యొక్క సమగ్రమైన చిత్రాన్ని పొందేందుకు వైద్యులు MRI పరీక్షను నిర్వహిస్తారు.
    • హిస్టెరోస్కోపీ: ఈ ఇన్వాసివ్ పరీక్షలో గర్భంలో ఉన్న ఫైబ్రాయిడ్లను మరింత దగ్గరగా చూసేందుకు యోని ద్వారా ఒక స్కోప్ చొప్పించబడుతుంది.
    • సోనోహిస్టెరోస్కోపీ: పైన పేర్కొన్న అన్ని పరీక్షలు విఫలం అయినపుడు గర్భాశయ కుహరంలోకి చిన్న కాథెటర్​తో కూడిన సెలైన్ ఇంజెక్ట్ చేయబడుతుంది. ఈ ఇమేజింగ్ టెక్నిక్ స్టాండర్డ్ అల్ట్రాసౌండ్ కంటే మరింత ఖచ్చితమైన చిత్రాన్ని అందిస్తుంది.
    • లాపరోస్కోపీ: ఈ పరీక్షలో మహిళ గర్భాశయం కింది వైపు ఒక రంధ్రం చేసి గర్భాశయంలోకి ఒక గొట్టాన్ని చొప్పిస్తారు.

    గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) ను ఎలా మేనేజ్ చేయాలి మరియు దాని చికిత్స ఏమిటి

    స్త్రీ శరీరంలో పెరిగే గర్భాశయ ఫైబ్రాయిడ్స్​ను (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) మేనేజ్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) మేనేజ్​మెంట్ అనేది వాటి పరిమాణం, సంఖ్య మరియు అవి ఎక్కడ ఏర్పడ్డాయనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకునేందుకు మీ వైద్య సంరక్షుడిని సంప్రదించాలి.

    గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) కు రెండు రకాలుగా చికిత్స చేయొచ్చు.

    • ఓరల్ మెడికేషన్
    • సర్జికల్ మెథడ్స్

    1. ఓరల్ మెడికేషన్స్ (నోటి ద్వారా తీసుకునే మందులు)

    ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) నివారించేందుకు సాధారణంగా సిఫారసు చేసే కొన్ని మందులు..

    • OTC పెయిన్ మెడిసిన్స్
    • ఐరన్ సప్లిమెంట్స్
    • బర్త్ కంట్రోల్ పిల్స్
    • GnRH ఆగోనిస్ట్ మెడికేషన్స్

    2. సర్జికల్ మెథడ్స్(శస్త్ర చికిత్సా పద్ధతులు)

    ఫైబ్రాయిడ్లను తొలగించేందుకు అత్యంత ప్రతిభావంతమైన శస్త్ర చికిత్సా పద్ధతులు ఉన్నాయి.

    • మైయోమెక్టమీ
    • హిస్టెరోస్కోపీ
    • లాపరోటోమీ
    • లాప్రోస్కోపీ
    • లాపరోటోమీ
    • హిస్టెరొక్టమీ
    • రేడియో ఫ్రీక్వెన్సీ ఎబలేషన్
    • గర్భాశయ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్

    గర్భాశయ ఫైబ్రాయిడ్లను (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) నివారించడం ఎలా

    స్త్రీ శరీరంలో ఫైబ్రాయిడ్లు(గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) పెరగకుండా ఆపేందుకు ఎటువంటి మార్గం లేదు. కానీ ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయడం మరియు సమతుల పద్ధతిలో ఆహారం తీసుకోవడం వంటి జీవనశైలిలో మార్పుల వలన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. శరీరంలో గర్భాశయ ఫైబ్రాయిడ్ల పెరుగుదలను తగ్గించేందుకు కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎవరైనా గర్భాశయ ఫైబ్రాయిడ్ (గర్భాశయంలో పెరిగే నిరపాయ కణతులు) లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే పెల్విక్ టెస్ట్ కోసం వారి వైద్య సంరక్షకుడిని సంప్రదించాలి.

    Article continues below advertisment

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.