Fetal Heartbeat
26 May 2023 న నవీకరించబడింది
తల్లి కాబోతున్న మహిళకు గర్భధారణ సమయం చాలా కీలకమైనది. ఆరోగ్య సమస్యలు అడుగడుగునా తలెత్తవచ్చు. కనుక, మీరు తల్లి కాబోతున్నట్లైతే, తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, సమగ్రమైన పనితీరు గల మానవ శరీరంలో రూపుదిద్దుకుంటున్న జీవి అవ్వటం వల్ల, బిడ్డ చాలా అపురూప స్వభావాన్ని కలిగి ఉంటుంది. బిడ్డ పెరగటానికి, పోషకాల కోసం, ఇతర అవసరాల కోసం తల్లి మీద ఆధారపడతుంది. కనుక తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, క్రమం తప్పకుండా బిడ్డ అభివృద్ధి మీద కూడా ధ్యాస పెట్టడం ప్రధానం.
సాంకేతిక దృక్కోణంలో, క్షీరదాల (ఈ సందర్భంలో మానవుల) గర్భస్థ శిశువు ఎనిమిది వారాల వయసు దాటితే “ఫీటస్” (పిండము, భ్రూణము) అని పిలుస్తాం. ఇంత వయసు కంటే ముందు గుండె చప్పుడు ఉండదు. గుండె చప్పుడును కొలవటానికి ఫీటల్ డాప్లర్ మానిటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆ పరీక్షను ఫీటల్ డాప్లర్ టెస్ట్ అని పిలుస్తారు.
ఫీటల్ డాప్లర్ టెస్ట్ అనేది ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష. ఇంట్లోనే శిశువు గుండె చప్పుడును కొలవటానికి చేతితో పట్టుకో గల ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. గర్భ సమయంలోని రెండో త్రైమాసిక సమయంలో, అంటే 13వ వారానికి, 28వ వారానికి మధ్య సాధారణంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. కొన్ని పరికరాలను 8 నుండి 12 వారాల మధ్య కూడా ఉపయోగించే అవకాశం ఉందని అవి తయారు చేసిన సంస్థలు ప్రకటించుకుంటాయి. అయినప్పటికీ వైద్యులు దాన్ని పెద్దగా సమర్ధించరు. ఫలితంలో పొరపాట్లు జరిగే విషయంలో తల్లులను కంగారుపెట్టకూడదనే ఉద్దేశంతో కొందరయితే 16 వారాల వరకు కూడా ఆగమంటూ ఉంటారు. గర్భస్థ శిశువు తల్లి పెల్విస్‌లో ఉన్నప్పుడు సాధారణంగా ఇలా ఫలితాల్లో పొరపాటు కనిపించే ఆస్కారం ఉంటుంది.
ఇంట్లో శిశువు గుండె చప్పుడును కొలిచే విధానం చాలా సులభం. ఈ-కామర్స్ స్టోర్స్ లోను, ఆఫ్‌లైన్ రీటేలర్స్ దగ్గర కూడా ఎట్-హోమ్ ఫీటల్ డాప్లర్లు లభిస్తాయి. ఈ విధానం ప్రామాణికమైనది. తల్లి గర్భం మీదుగా ఈ పరికరాన్ని నెమ్మదిగా కదిపితే ఫలితం కనిపించే విధంగా దీన్ని తయారుచేశారు. శిశువు గుండె చప్పుడును వింటే వారితో అనుబంధం కూడా బలపడుతుంది. ఈ విధానం వెనుక శాస్త్రీయత కూడా క్లిష్టమైనదేం కాదు. ఈ పరికరం నుండి విడుదలయ్యే అధిక పౌనఃపుణ్య తరంగం శిశువు వెలువరించే ధ్వనులను కనిపెట్టి రీడింగ్ ఇస్తుంది.
ఈ విధానం సులభంగా అనిపించవచ్చు, ఇప్పుడే ‘ఎట్-హోమ్ ఫీటల్ డాప్లర్’ కొనటానికి మీరు సిద్ధపడవచ్చు. అయినప్పటికీ, ఇది కొనే ముందు మీ వైద్యులను సంప్రదించి కూలంకషంగా ఈ అంశం గురించి చర్చించటం చాలా ముఖ్యమని సిఫారసు చేస్తున్నాం. రెండో విషయం ఏమిటంటే, ఈ పరికరం వాడటం వల్ల ఏర్పడ గల ప్రమాదాల గురించి అవగాహన తెచ్చుకోవటం అతి ప్రధానం. తల్లికి, బిడ్డకి కూడా ప్రమాదాలు తలెత్తవచ్చు. కీలకంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మొట్టమొదటి ఫీటల్ డాప్లర్ టెస్ట్ వైద్యుల సమక్షంలో, అనుభవం గల సోనోగ్రాఫర్ (అల్ట్రాసౌండ్ నిపుణులు) చేతుల మీదుగా జరగటం సరైనదని సిఫారసు చేస్తారు. ఆ తర్వాతే తల్లి కాబోతున్న మహిళ స్వయంగా ఇంట్లో ఫీటల్ డాప్లర్ పరీక్ష చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల తగిన సమయంలో ఫీటల్ డాప్లర్ చేసుకోవటం జరుగుతుంది, ఫలితం సరిగ్గా వస్తుంది.
ఆసుపత్రులలో వాడే ఫీటల్ డాప్లర్ పరికరాలతో పోలిస్తే ఎట్-హోమ్ ఫీటల్ డాప్లర్ పరికరాల నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్ల ఇవి తప్పుగా ఫలితాలను చూపిస్తాయనే వాదన ఉంది. తల్లి-బిడ్డ సంబంధం యొక్క సునిశితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పరీక్షను నిపుణుడైన సోనోగ్రాఫర్లే చేయటం సరైనదని కూడా కొందరు అంటారు. మంత్రసానులు ప్రబలంగా పనిచేసే ప్రాంతాలలో వారు కూడా ఇంట్లో ఫీటల్ డాప్లర్ పరికరం వాడకాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ ఇది ఒక దృక్కోణమే తప్ప, తప్పనిసరిగా పాటించవలసినది కాదు. గర్భస్థ శిశువులను పరిశీలించటానికి తల్లిదండ్రులు ఈ సాంకేతికతను ఉపయోగించారు, ఉపయోగిస్తూనే ఉన్నారు. ఏ కారణం వల్లైనా మీ వైద్యులు ఎట్-హోమ్ ఫీటల్ డాప్లర్ వాడవద్దు అని కట్టడి చేయనిదే, తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించటంలో తప్పేమీ లేదు. ఈ వ్యాసం చదివినందుకు కృతజ్ఞతలు, తల్లిదండ్రులు కాబోతున్న మీకు అభినందనలు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలోని మొదటి మూడు నెలలలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సురక్షితమేనా?
Yes
No
Written by
swetharao62
swetharao62
నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా కావడానికి కారణాలు ఏమిటి? దీనికి ఎలా చికిత్స తీసుకోవాలి?
మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!
గర్భధారణలో ఆముదం: గర్భధారణ సమయంలో ఆముదం ఎందుకు వాడతారు? దీనివల్ల కలిగే ప్రమాదాలేంటి?
గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
మీ ప్రెగ్నెన్సీ రెండో త్రైమాసికంలో మీరు మీ భాగస్వామితో సెక్స్ చేయడం సురక్షితమేనా?
గర్భవతులు ప్రసవానికి వెళ్లేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలు
100% Secure Payment Using
Stay safe | Secure Checkout | Safe delivery
Have any Queries or Concerns?
Mylo is a master brand offering solutions through it's subsidiaries - Mylo Care and Mylo Baby.
Mylo Care offers science backed, expert led solutions across multiple health concerns.
Mylo Baby is a one stop solution for young parents for all their baby's needs.
Chamomile | Skin - Hygiene | Intimate Area Rashes | Diapers & Wipes | Disposable Diapers | Cloth Diapers | Baby Wipes | Diapers & Wipes - Baby Care | Hair | Skin | Bath & Body | Diapers & Wipes - Baby Wellness | Diaper Rash | Mosquito Repellent | Anti-colic | Diapers & Wipes - Baby Gear | Carry Nest | Dry Sheets | Bathtub | Potty Seat |