hamburgerIcon
login

Trying to get pregnant?

Take the Test

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • హెయిర్ కండీషనర్ కొనుగోలు చేసేటప్పుడు తయారీకి వాడే పదార్థాలు గురించి ఏం చూడాలి?  arrow

In this Article

     హెయిర్ కండీషనర్ కొనుగోలు చేసేటప్పుడు తయారీకి వాడే పదార్థాలు గురించి ఏం చూడాలి? 

    హెయిర్ కండీషనర్ కొనుగోలు చేసేటప్పుడు తయారీకి వాడే పదార్థాలు గురించి ఏం చూడాలి? 

    Updated on 17 May 2023

    Article Continues below advertisement

    షాంపూలు, కండీషనర్లు, నెలవారీ ట్రీట్​మెంట్లు, కటింగ్, మరియు కలరింగ్ గురించి చూసుకోవాలి, కాబట్టి మీ జుట్టు సంరక్షణ అంత ఆషామాషీ విషయం కాదు. మీ జుట్టు నాణ్యతను లుక్​ను కాపాడుకునేందుకు మీరు అనేక రకాలుగా ఖర్చు చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేసేటప్పుడు మీ జుట్టు కోసం కండీషనర్లు ఎంచుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎందుకు ఉండకూడదు? మనలో చాలామంది ఎక్కువ ప్రచారం చేసిన ఉత్పత్తులనే కొనుగోలు చేస్తారు. కొన్నిసార్లు ఆ ఉత్పత్తులు అంత నాణ్యతగా ఉండవు. ఈ విషయం మనం మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేసే ముందు దాని వెనుక భాగంలో తయారు చేసేందుకు వాడే పదార్థాల జాబితా చూడడం మంచిది. మీరు కొనుగోలు చేసిన ఉత్పత్తులు మీ శరీరానికి ఎటువంటి హాని తలపెట్టవని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయండి.

    హెయిర్ కండీషనర్​లో ఉండవలసిన టాప్ ​5 తయారీకి వాడే పదార్థాలు

    హెయిర్ కండీషనర్లు తప్పకుండా కలిగి ఉండవలసిన ఐదు ముఖ్యమైన పదార్థాల జాబితా:

    అలోవేరా(కలబంద) జ్యూస్

    అలోవేరా (కలబంద) లో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. మీ తల మీద జుట్టు పెరిగే ప్రాంతంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్​ను రిపేర్ చేయడంలో ఇది సహాయం చేస్తుంది. అలోవేరా గొప్ప కండీషనర్​గా కూడా పని చేస్తుంది. ఇది మీ జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. చుండ్రును నివారించేందుకు మరియు దురదను అరికట్టేందుకు ఇది ఉత్తమమైనది. తద్వారా మీకు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది.

    D-పాంథెనాల్ (విటమిన్ B5)

    హెయిర్ కండీషనర్లలో కనిపించే అత్యంత సాధారణ ఇంగ్రిడియెంట్స్​లో విటమిన్ B5 ఒకటి. ఇది ఒక ప్రోటీన్ వలే వింతగా ప్రవర్తిస్తుంది. విటమిన్ B5 ను అప్లై చేయడం వలన జుట్టు షాఫ్ట్​లోకి చొచ్చుకుపోతుంది మరియు తేమను నిలుపుకోవడంలో సహాయం చేస్తుంది. మీ పాడయిపోయిన జుట్టును తద్వారా మరమ్మత్తు చేస్తుంది.

    హాజెల్​నట్ మరియు ఆర్గాన్ ఆయిల్

    హెయిర్​ కండీషనర్లలో సహజ నూనెలు ఉండడం వలన మీ జుట్టుకు పోషణను అందిస్తాయి. మృదువుగా చేయడంలో సహాయం చేస్తాయి. సహజమైన ఆయిల్స్ మీ జుట్టులో పోషకాలను నింపడంలో సహాయం చేస్తాయి. మినరల్ ఆయిల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నియంత్రిస్తుంది. నాసిరకం హెయిర్ కండీషనర్లు ఎక్కువగా మలినాలను కలిగి ఉంటాయి. ఇవి విషపూరితమైనవి మరియు క్యాన్సర్ కారకాలుగా పని చేస్తాయి.

    Article continues below advertisment

    షియా బటర్ (షియా మొక్క నుంచి తయారుచేసేది)

    షియా బటర్ అనేది షియా లేదా కరాటే ట్రీ నుంచి తయారు చేస్తారు. ఇది అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. షియా బటర్ ఎక్కువగా ఉండే హెయిర్ కండీషనర్లతో మీకు హెల్తీ హెయిర్ ఫోలికల్స్, జుట్టు విరిగిపోయే అవకాశాలను తగ్గించడం, మీ జుట్టును మెరిసేలా మరియు అందంగా తయారు చేయడంలో సహాయం చేస్తాయి.

    ప్లాంట్ కెరాటిన్

    గోధుమ, సోయా, కార్న్ ప్రొటీన్స్ ప్లాంట్ కెరాటిన్ యొక్క ప్రధాన భాగాన్ని కలిగి ఉంటాయి, ఇది జుట్టు ప్రోటీన్స్ యొక్క ఫంక్షనల్ నిష్పత్తిని పెంచుతుంది. అందువల్ల ప్లాంట్ కెరాటిన్ డ్యామేజ్ అయిన జుట్టుకు ప్రొటీన్ల బెటర్ పీల్చుకోవడం, యాంకరింగ్ అందజేస్తూ, మీ జుట్టును రిపేర్ చేస్తూ మరింత బలంగా చేసేందుకు సహాయపడతాయి. ఇవి మీ జుట్టు మృదుత్వం మరియు ప్రకాశాన్ని పెంచుతాయి. సహజ మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉన్న బెస్ట్ హెయిర్ కండీషనర్లు కొనుగోలు చేయండి. మరీ ముఖ్యంగా మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని కొనుగోలు చేయండి. ఏదైనా ప్రొడక్టు కొనుగోలు చేసేటప్పుడు అందులో వాడే ఇంగ్రిడియంట్స్ జాబితాను ఒకసారి పరిశీలించండి. “మైలోకేర్” అందజేస్తున్న ఆనియన్ హెయిర్​ఫాల్ కంట్రోల్ కండీషనర్​ను చెక్ చేయండి. ఈ హెయిర్ ​కండీషనర్​లో రెడ్ ఆనియన్ ఆయిల్, బృంగరాజ్, ప్లాంట్ కెరాటిన్, కొబ్బరినూనె, బాదం నూనె వంటి సహజంగా లభించే నూనెలు, సేంద్రియ పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఈ సహజ పదార్థాలు మీ జుట్టును మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయపడతాయి. మీ జుట్టును ఈ కండీషనర్ సాఫ్ట్ మరియు స్మూత్​గా చేస్తుంది. SLS, పారాబెన్స్, మినరల్ ఆయిల్స్, థాలెట్స్, సిలికాన్స్, సింథటిక్ కలర్స్, సువాసనలు మరియు కెమికల్స్ లేని సహజ హెయిర్ కండీషనర్లను ఎంచుకోండి. మీరు వాడే కండీషనర్ వెగన్​ –ఫ్రెండ్లీ, అలర్జీ మరియు క్రూరత్వం లేని సర్టిఫైడ్ కలిగి ఉంటే ఉత్తమం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఉల్లిపాయ హెయిర్ సీరమ్‌ను ఎంత తరచుగా ఉపయోగించవచ్చు?

    సూచించేవి:

    1. కెమికల్స్ మరియు టాక్సిన్ లేని హెయిర్ కండీషనర్​ను ఎంచుకుని తేడా గమనించండి.

    2. మీకు ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టు కావాలా? సహజమైన పదార్థాలు ఎక్కువగా ఉండే హెయిర్ కండీషనర్​ను ఎంచుకోండి.

    Article continues below advertisment

    Anti Hairfall Combo - Onion Oil & Onion Shampoo 200 ml each

    Prevents Hairfall | Hydrates Scalp | Made Safe Australia Certified

    ₹ 739

    4.2

    (342)

    3802 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.