hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Conception arrow
  • ప్రెగ్నెంట్ కావడానికి ఎంత సమయం పడుతుంది (How Long Does it Takes to Get Pregnant in Telugu)? arrow

In this Article

    ప్రెగ్నెంట్ కావడానికి ఎంత సమయం పడుతుంది (How Long Does it Takes to Get Pregnant in Telugu)?

    Conception

    ప్రెగ్నెంట్ కావడానికి ఎంత సమయం పడుతుంది (How Long Does it Takes to Get Pregnant in Telugu)?

    3 November 2023 న నవీకరించబడింది

    ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కావాలని నిర్ణయించుకున్నారు. ఇది జరుగుతుందా? లేదా? అని మీరు ఆందోళనతో ఉంటారు. కానీ మీరు సెక్స్​లో పాల్గొన్న మొదటి నెలలో గర్భవతి కాలేకపోవచ్చు. కలయిక తర్వాత ఎన్నిరోజులకు మీకు గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గర్భవతి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. కింద చూపించిన డేటా చాలా మందిని అధ్యయనం చేయగా లభించిన డేటా. కలయిక, అలాగే సక్సెస్​ఫుల్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన డేటా: 30% మంది మహిళలు మొదటి నెలలో, 60% శాతం మంది మహిళలు మొదటి మూడు నెలల్లో, 80% మంది మహిళలు మొదటి ఆరు నెలల్లో ప్రెగ్నెంట్ అవుతున్నారు. 85% మంది మహిళలు ఒక సంవత్సరం ప్రయత్నించిన తర్వాత గర్భవతి అవుతున్నారు. ఏదేమైనా 10% శాతం మంది మహిళలు ఇన్​ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారు సహజంగా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు తక్కువ. వారికి సరైన చికిత్స అవసరం. ఇప్పుడే మనం చూసినట్లు సక్సెస్​ఫుల్ ప్రెగ్నెన్సీ రేటు అనేది అనేక కారకాల వల్ల డిసైడ్ అవుతుంది. ప్రతి వ్యక్తిలో ఇది భిన్నంగా ఉంటుంది. సెక్స్ తర్వాత ప్రెగ్నెంట్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకునేందుకు మరింత చదవండి

    కన్సెప్షన్ (గర్భధారణ) ఎప్పుడు సంభవిస్తుంది? మరింత సమాచారం (When does conception occur? Some more data...)

    ఇక్కడ తలెత్తే మరో ప్రశ్న ఏమిటంటే కన్సెప్షన్ (గర్భధారణ) ఎప్పుడు జరుగుతుంది? గణాంకాల ప్రకారం.. సెక్స్ తర్వాత గర్భం ధరించేందుకు ప్రయత్నించిన 20 సంవత్సరాలలో ఉన్న ఆరోగ్యకరమైన ఫెర్టయిల్ వుమెన్ 86 శాతం మంది ప్రెగ్నెంట్ అవుతున్నారు. 30లలో ఉన్న 63 శాతం మంది మరియు 40లలో ఉన్న కేవలం 36 శాతం మంది మాత్రమే 1 సంవత్సరం తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న జంటలు ఒక సంవత్సరం పాటు ప్రయత్నించినపుడు, 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న జంటలు ఆరునెలలు ప్రయత్నించినా ప్రెగ్నెంట్ కాకపోతే ఆ సమస్యను ఇన్​ఫెర్టిలిటీ (వంధ్యత్వం) అని నిర్వచిస్తారు. ప్రెగ్నెంట్ కావాలంటే మొదటగా స్పెర్మ్ అనేది యోనిలోకి ప్రవేశించి అండంతో కలవాలి. ఈ విషయం తర్వాత మనకు తలెత్తే మొదటి ప్రశ్న ఏమిటంటే.. స్పెర్మ్ అనేది అండాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? కలయిక సమయంలో మగవారి పునరుత్పత్తి అవయవం(పురుషాంగం), స్త్రీ పునరుత్పత్తి అవయవం (యోని)లోకి స్కలనం చేసినప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది.

    ఈ విషయం మీకు తెలుసా? (Did you know?)

    వీర్యకణాలు వల్వా (యోని ప్రాంతం)లోకి వచ్చినపుడు యోనిలోకి ప్రవేశిస్తాయి. అయితే, ఆ యోని కణాలు గుడ్డును కలవడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది.

    ఓవర్​వ్యూ: ప్రెగ్నెన్సీ కోసం కలయిక (ఇంటర్‌కోర్స్) (Overview: Intercourse to pregnancy)

    • డే 1: సెక్స్ అనేది మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఆరంభం మాత్రమే. తదుపరి కొన్ని రోజుల వరకు కూడా స్పెర్మ్ అనేది మీ యోని ద్వారా ప్రవేశించి ఫెలోపియన్ గొట్టాలలోకి చేరుకుంటుంది. అక్కడ అండం కోసం చూస్తుంటుంది.
    • ఇప్పుడు మన ప్రశ్నకు తిరిగి వస్తే.. వీర్యకణాలు అండాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
    • డే 2: సెక్స్ తర్వాత స్పెర్మ్ అనేది మీ శరీరంలో ఆరు రోజుల వరకు జీవించి ఉంటుంది. అండం విడుదల కోసం వెయిట్ చేస్తుంది. ఇలా అండం విడుదలయ్యే ప్రాసెస్​ను ఒవొల్యూషన్(అండోత్సర్గము) అని అంటారు. స్పెర్మ్ అనేది అండంతో కలిసినపుడు ఫలదీకరణం అని అంటారు.
    • డే 3: ఫలదీకరణం చెందిన అండం నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తుంది. మరియు అది గర్భాశయం వైపు కదులుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు వారం రోజుల సమయం పడుతుంది.
    • డే 8: అది అక్కడికి చేరుకున్న తర్వాత.. గర్భాశయ లైనింగ్​కు అతుక్కుంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ అటాచ్​మెంట్ ప్రక్రియను ఇంప్లాంట్​టేషన్ అని అంటారు. అప్పుడే ప్రెగ్నెన్సీ మొదలవుతుంది.
    • మీరు ప్రెగ్నెంట్​గా ఉన్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒక్కటే మార్గం. ఈ పరీక్షను మీరు ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. మీరు ఈ కిట్​ను దగ్గర్లోని మెడికల్ షాపు నుంచి లేదా ఆరోగ్య కేంద్రం లేదా గైనకాలజిస్ట్​ నుంచి తీసుకోవచ్చు.

    ప్రెగ్నెంట్​గా ఉన్నపుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు (Essential things to keep in mind while getting pregnant )

    మన శరీరాలు ఎంత సంక్లిష్టమైనవో, సమర్థవంతమైనవో తెర వెనుక ఎంత సంక్లిష్టతకు దారితీస్తాయో తెలుసుకోవడం అసాధ్యం. మీరు ప్రెగ్నెంట్ కావడానికి ప్రయత్నిస్తున్నపుడు ఈ కింది చిట్కాలు సహాయపడతాయి.

    • మీ అండాలను పరిగణనలోనికి తీసుకోవడం (Taking account of your eggs)

    మీరు 1 నుంచి 2 మిలియన్ల అండాల విడుదల జన్మించారు. మీరు యుక్తవయస్సుకు వచ్చే సరికి మీలో కేవలం 5 లక్షల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ సంఖ్య అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. మీకు 37 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ఈ సంఖ్య 25 వేలకు పడిపోతుంది. మీరు మోనోపాజ్ దశ (పీరియడ్ ఆగిపోయే దశ)కు చేరుకునే సరికి ఆ సంఖ్య వేయికి పడిపోతుంది.

    • వయస్సు (Age)

    మీ సంతానోత్పత్తి అవకాశాలు 32 సంవత్సరాల తర్వాత తగ్గుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. కాబట్టి గర్భవతి కావడానికి ఎంత సమయం పడుతుందనే మీ అతి పెద్ద ప్రశ్నకు వయస్సు సమాధానం కావొచ్చు.

    • శరీర బరువు (Body Weight)

    శరీర బరువు అనేది ఆరోగ్యకరమైన BMI (బాడీ మాస్ ఇండెక్స్) మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీర బరువు గర్భవతి అయ్యే మీ అసమానతలను తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యకరమైన BMIని మెయింటెన్​ చేయడం కోసం మంచి డైట్ తీసుకోవడం, వ్యాయామాన్ని నిశితంగా పరిశీలిస్తుండడం చాలా అవసరం. ఇది మిమ్మల్ని త్వరగా ప్రెగ్నెంట్ అయ్యేందుకు సహాయకారిగా ఉంటుంది.

    సాదాసీదాగా ఊహించడం కంటే ఖచ్చితమైన ఓవులేషన్ (అండోత్సర్గము) తేదీలను గురించి తెలుసుకునేందుకు ఓవులేషన్ ప్రెడిక్టర్ కిట్ ఉపయోగించడం వలన ఫలితాలు నిర్ధిష్టంగా వస్తాయి. మీ బేసల్ బాడీ టెంపరేచర్,​ మీ రుతుచక్రాన్ని ట్రాక్ చేయడం వలన కూడా గర్భవతి కావడానికి ఉత్తమ రోజులను గుర్తించడంలో సహాయపడుతుంది.

    • ఎగ్ ఫ్రీజింగ్ (Egg Freezing)

    ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు 20, 30, 40ల వయస్సు వరకు పిల్లల్ని కనకుండా ఉంటున్నారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేయొద్దని, దాని వల్ల ఏర్పడే పర్యావసనాలను చెబుతుంటాం. అందుకోసమే కొంత మంది ఎగ్ ఫ్రీజింగ్ వంటి సైంటిఫిక్ విషయాల మీద ఆధారపడతారు.

    • సెక్స్ కోసం సమయాన్ని నిర్ణయించడం (Give time to sex)

    గర్భధారణ ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకు మీరు సమాధానం పొందేందుకు మీరు కొంత హోం వర్క్, రీసెర్చి చేయాల్సి ఉంటుంది. మీరు మీ ఒవొల్యూషన్ (అండోత్సర్గము) విడుదల తేదీల్లోనే కలయికను ప్లాన్ చేయొచ్చు. అండాశయాలు అండాన్ని విడుదల చేసినపుడు గర్భం ధరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అండం అనేది తదుపరి 12 నుంచి 24 గంటల వరకు జీవించి ఉంటుంది. మనం ముందుగా చర్చించినట్లుగా స్పెర్మ్ అనేది ఐదు రోజుల వరకు జీవించగలదు. మీరు కనుక మీ ఒవొల్యూషన్ సమయంలోని ఐదు రోజుల్లో సెక్స్​లో పాల్గొంటే అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    వీటి నుంచి తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు (Takeaways)

    పైన పేర్కొన్న విధంగా 32 సంవత్సరాల వయసు తర్వాత సంతానోత్పత్తి అనేది క్షీణిస్తుంది. ఇంకా 37 సంవత్సరాల వయసు తర్వాత మరింత ఘోరంగా తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా త్వరగా గర్భం దాల్చాలని యోచిస్తే.. గర్భవతి కావడానికి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్నకు ఇప్పుడు మీ వద్ద ఖచ్చితమైన సమాధానం ఉంది. దాని నుంచి ఏం ఆశించాలో తెలుసుకోండి. మీకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ప్రెగ్నెన్సీ రావాలని మేం కోరుకుంటున్నాం.

    Tags

    Getting pregnant in telugu, Pregnancy test in telugu, Tips to get pregnant quickly in telugu, how long it takes to get pregnant In English, how long it takes to get pregnant In Hindi, how long it takes to get pregnant In Tamil, how long it takes to get pregnant In Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.