hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Scans & Tests arrow
  • నాల్గవ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది? arrow

In this Article

    నాల్గవ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది?

    Scans & Tests

    నాల్గవ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా ఏం తెలుస్తుంది?

    3 November 2023 న నవీకరించబడింది

    Article Continues below advertisement

    మీరు బిడ్డ కావాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ప్రెగ్నెన్సీ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లయితే, ముందుగా మీకు అభినందనలు! మీ ప్రెగ్నెన్సీలోని ప్రారంభ వారాలు పూర్తి అయి ఉండవచ్చు. మీరు ప్రినేటల్ విజిట్ కోసం వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ప్రారంభ సమయాన్ని అలాగే 4 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోవడానికి అనువైన సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా కీలకం. గర్భం యొక్క ప్రారంభ దశలలో నాల్గవ వారంలో ప్రెగ్నెన్సీ స్కాన్ ఏమి నిర్ధారిస్తుంది? ఏమి సూచిస్తుంది? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ కథనం మీకు సహాయం చేస్తుంది. మీరు ఒక నెల గర్భవతి అయితే, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం చాలా తొందరగా ఉండవచ్చు. వాస్తవానికి మీ 4 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ మీకు కణాల సేకరణను మాత్రమే చూపుతుంది. దీనిని బ్లాస్టోసిస్ట్ అని అంటారు. ఈ బ్లాస్టోసిస్ట్ నువ్వుల కంటే కూడా చాలా చిన్నగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు.

    ప్రారంభ దశలో గర్భం గురించి ఎందుకు మరింత తెలుసుకోలేకపోతున్నారు?

    మీ గర్భం యొక్క నాల్గవ వారంలో బ్లాస్టోసిస్ట్ నిరంతరం అభివృద్ధి చెంది, విడిపోతుంది. వాస్తవానికి మీరు మరికొన్ని వారాలు వేచి ఉంటేనే మీ గర్భం గురించి మరింత తెలుసుకుంటారు. ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ మీరు గర్భం దాల్చి ఐదు వారాలు అయినప్పుడు మీ గర్భంలో మార్పులను గుర్తించగలదు. వాస్తవానికి అధునాతన పరికరాలను ఉపయోగించే అనుభవజ్ఞుడైన సోనోగ్రాఫర్‌కు కూడా గర్భం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కనీసం ఐదు వారాలు గడపవలసి ఉంటుంది.

    అల్ట్రాసౌండ్ స్కాన్‌లో బిడ్డ కన్పించకుండా ఉండడం సాధ్యమేనా?

    శిశువు నిరంతరం గర్భం లోపల అభివృద్ధి చెందుతుంది. దాని నుండి ఎక్కడికీ కదలదు. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ నుండి శిశువును దాచే అవకాశం లేదు. అయితే మీరు 4 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్ తీసుకునేటప్పుడు చాలా తొందరలో ఉంటే.. మీ బిడ్డ మీకు కనబడకపోవచ్చు! కొన్నిసార్లు వైద్య బృందం అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో గర్భం యొక్క ప్రారంభ దశలను గమనించవచ్చు. నిజానికి వారు ఏ అండాశయం మార్పులకు గురవుతోందో? కార్పస్ లుటియం ఉందో లేదో తెలుసుకోగలరు! కార్పస్ లుటియం అనేది ప్రాథమికంగా ఒక తిత్తి. ఇది గర్భాశయంలోని పొరను నిర్వహించడానికి అభివృద్ధి చెందుతుంది. చివరికి గర్భం అనేక దశలలో పురోగమిస్తుంది. ఒక గర్భిణీ స్త్రీ సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి ఎనిమిది వారాలలో అనేక హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటుంది. మీ వైద్య బృందం మీ గర్భాశయం మందంగాను, ప్రకాశవంతంగాను ఉండటం కూడా గమనించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

    ఈ దశలో చెక్‌లిస్ట్‌ను నిర్వహించడాన్ని మీరు ఎందుకు పరిగణించాలి?

    మీ గర్భం నాల్గవ వారంలోఉన్నప్పుడు, మీరు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు చెక్‌లిస్ట్‌ ఉంచుకుంటే అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీ చెక్‌లిస్ట్‌లోని కొన్ని అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి!

    1. మీ ప్రినేటల్ విజిట్స్‌లో మీరు మీ డాక్టర్‌ని కలవాలని గుర్తుంచుకోండి. అలా కాకుండా, మీరు మీ ప్రెగ్నెన్సీని నిర్ధారించాలనుకుంటే మీరు మూత్రం, సాధారణ రక్త పరీక్షలు కూడా చేయించుకోవచ్చు!

    2. ఈ దశలో మీరు మీ అన్ని విటమిన్లు, సప్లిమెంట్లను తీసుకోవడం కూడా ముఖ్యమైనది కావచ్చు. మీ డాక్టర్ మీకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు లేదా సప్లిమెంట్లను సూచించవచ్చు.

    3. ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నారు. మీ ఆరోగ్యంతో పాటు అభివృద్ధి చెందుతున్న మీ శిశువు ఆరోగ్యం విషయంలో మీరు చాలా బాధ్యత వహించాలి. ధూమపానం చేయడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయడానికి ఇది చాలా మంచి సమయం కావచ్చు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నించండి. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు త్రాగాలని గుర్తుంచుకోండి!

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.