hamburgerIcon
login

SHOP BABY PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి? arrow

In this Article

    నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి?

    Care for Baby

    నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి?

    3 November 2023 న నవీకరించబడింది

    నవజాత శిశువుల్లో పెదవులు పగలడం మామూలే. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదు. అలాగని, చికిత్స చేయకుండా ఉంటే పిల్లలు పాలు తాగేప్పుడు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అందుకే, సంరక్షణ తప్పనిసరి. నవజాత శిశువుల్లో పగిలిన పెదవుల గురించి అన్ని విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి.

    పెదవులు పగలడానికి కారణాలేంటీ?

    1. వాతావరణం: వాతావరణం ఎక్కువ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు, గాలి పొడిగా ఉన్నప్పుడు పిల్లల పెదవులపై తేమ ఆవిరవుతుంది. పెదవులు పొడిగా మారతాయి.
    2. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం: జలుబు వల్ల ముక్కు బ్లాక్ అయినప్పుడు, నవజాత శిశువులు నోటితో గాలిపీలుస్తారు. పెదవుల మీదుగా గాలి ఆడుతూ ఎండిపోతాయి. పెదవులు పగలడానికి ఇది కూడా ఓ కారణం.
    3. డీహైడ్రేషన్: వాతావరణం వేడిగా ఉండటం లేదా పిల్లలు కావాల్సినంత పాలు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీని వల్ల పెదవులు ఎండిపోతాయి.
    4. అల్లెర్జిక్ రియాక్షన్స్: లిప్ బామ్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, స్టఫ్డ్ టాయ్స్, కొన్ని రకాల దుస్తులు, బ్లాంకెట్స్ లాంటివి అలెర్జీకి కారణమై, పిల్లల పెదవులు పగుల్తాయి.
    5. మందులు: పిల్లలకు ఇచ్చే కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా పెదవులు పగుల్తాయి.
    6. పెదవులు చప్పరించడం, చొంగకార్చడం: పిల్లలు తమ పెదాలను చప్పరిస్తూ ఉంటే, నోటి నుంచి లాలాజలం బయటకు వస్తుంది. దీనివల్ల పెదవులు ఎండిపోయి, చివరకు పగుళ్లు కనిపిస్తాయి.
    7. పళ్లతో పెదవుల్ని కొరకడం: శిశువులకు పళ్లు వచ్చిన తర్వాత, పెదవుల్ని కొరుకుతుంటారు. దీనివల్ల కూడా పెదవులు పగుల్తాయి.

    మీ పిల్లల్లో పెదవులు ఎందుకు పగుల్తాయి?

    నవజాత శిశువు జన్మించిన కొన్ని వారాల వరకు చర్మం ఊడిపోతుంది. ఇందుకు కారణం బయటి వాతావరణానికి నవజాత శిశువు చర్మం అలవాటు పడుతుండటమే. నవజాత శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సురక్షితమైన తడిస్నానం మాత్రమే పొందుతారు. కానీ బయటకు వచ్చిన తర్వాత, ఈ ప్రపంచానికి అలవాటు పడాలి. అందుకే చర్మం ఊడిపోతూ ఉంటుంది. దీని వల్లా శిశువు పెదవులు పగుల్తాయి. అంతేకాకుండా, నవజాత శిశువు చర్మం సన్నగా, మెత్తగా, సున్నితంగా ఉంటుంది. పెదవులకు తైల గ్రంథులు ఉండవు. ఈ అడ్డంకి లేకపోవడం వల్ల నవజాత శిశువుల పెదవులు ఎండిపోయి, సులువుగా పగుల్తాయి. చాలా అరుదుగా, కవాసాకి వ్యాధి వల్ల కూడా ఇలా జరగొచ్చు. అదే జరిగితే రక్తనాళాల్లో వాపు రావడానికి కారణం అవుతుంది. ఒకవేళ శిశువుకు జ్వరం ఎక్కువ రోజులు ఉండటం, పెదవులు పగిలి ఉండటం లాంటి లక్షణాలు ఉంటే పీడియాట్రీషియన్‌ను వెంటనే కలవాలి.

    మీ శిశువు డీహైడ్రేట్ అయినట్టు ఎలా గుర్తించాలి?

    నవజాత శిశువుల్లో డీహైడ్రేషన్ సంకేతాలను ఇలా గుర్తించాలి:

    • మూత్ర విసర్జన తక్కువ సార్లు ఉండటం: ఒకవేళ బేబీ డైపర్ ఆరు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సేపు పొడిగా ఉండటం.
    • మల విసర్జన సరిగ్గా లేకపోవడం లేదా మలబద్ధకం.
    • పాదాలు, చేతులు చల్లగా ఉండటం.
    • ఏడుపు తక్కువగా ఉండటం లేదా కన్నీళ్లు లేకపోవడం.
    • ఎప్పట్లా కాకుండా తక్కువ ఆడుతూ ఉండటం.
    • తలపైన మృదువైన ప్రదేశం మునిగినట్టు ఉండటం.
    • శ్వాస వేగంగా, లోతుగా తీసుకుంటూ ఉండటం.
    • చర్మం, పెదవులు ఎండిపోవడం.
    • అలసిపోవడం, నిద్రమత్తుతో ఉండటం, పిచ్చిగా, గజిబిజిగా చేస్తుండటం.

    పిల్లలకు ఎప్పుడూ పెదవులు పగిలే ఉంటే ఏం చేయాలి?

    కొన్ని వారాల తర్వాత కూడా పిల్లల్లో పగిలిన పెదవుల సమస్య తగ్గకపోతే, ఇతర ఆరోగ్య సమస్యలకు అది లక్షణంగా భావించాలి.

    • అది విటమిన్ లోపం లేదా విటమిన్ ఏ లాంటి విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం కావొచ్చు.
    • లిప్ లిక్కర్ డెర్మటైటస్ కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. లాలాజలం కారణంగా చిరాకు ఏర్పడి, ఈ సమస్య వస్తుంది. దీని వల్ల శిశువుల్లో అసౌకర్యంగా, దురదగా ఉంటుంది. ఉపశమనం పొందడానికి పిల్లలు వెంటనే పెదవుల్ని చప్పరిస్తుంటారు. ఇలా కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుంది. పగుళ్లు వచ్చి, రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదముంది.
    • ఇక మరో తీవ్రమైన, అరుదైన పరిస్థితి కవాసాకి వ్యాధి రావడం. ఇది ఇతర దేశాలతో పోలిస్తే జపాన్‌లో ఎక్కువ. పెదవులు ఎండిపోవడం, పగుళ్లు రావడం మాత్రమే కాదు, పిల్లల్లో జ్వరం ఎక్కువకాలం ఉంటుంది. గజ్జ ప్రాంతంలో దద్దుర్లు వస్తాయి. నాలుకపై ఎర్ర మచ్చలు, వాపు, లింఫ్ గ్రంథులు వాయడం, చేతులు, కాళ్లు ఉబ్బడం లాంటి లక్షణాలు ఉంటాయి.
    • పిల్లల్లో పగిలిన పెదవుల సమస్య కొన్ని వారాల పాటు ఉంటే, తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

    పిల్లల్లో పెదవులు పగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    1. తల్లిపాలు: పిల్లల్లో పగిలిన పెదవుల సమస్య తగ్గించడానికి తల్లిపాలు ఉపయోగపడతాయి. తల్లిపాలను కొన్ని చుక్కలు పిల్లల పెదవులపై వేయాలి.
    2. కొబ్బరి నూనె: సెంటు కలపని, స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. తల్లిపాలల్లో కూడా లారిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే స్వచ్ఛమైన కొబ్బరి నూనె పెదవులకు రాయడం ద్వారా, పెదవులు హైడ్రేట్‌గా ఉంచేలా చూసుకోవచ్చు.
    3. లానోలిన్ క్రీమ్: పగిలిన చనుమొనలకు చికిత్స కోసం లానోలిన్ క్రీమ్ ఉపయోగిస్తారు. పిల్లల్లో పగిలిన పెదవులకు కూడా ఈ క్రీమ్ ఉపయోగించవచ్చు.
    4. తల్లిపాలు కొనసాగించడం: పిల్లలకు కావాల్సినంత తల్లిపాలు ఇవ్వడం కూడా మంచిది.

    పిల్లల్లో పెదవులు పగలకుండా ఏం చేయాలి?

    • పిల్లల గదిలో గాలిలో తేమ తగ్గి పొడిగా మారకుండా చూసేందుకు హ్యుమిడిఫయర్‌ను ఉపయోగించాలి.
    • కఠినమైన వాతావరణం ఉన్నప్పుడు పిల్లల్ని రక్షించడానికి, అవసరమైన దుస్తులు వేయడంతో పాటు, బేబీ బ్లాంకెట్స్ ఉపయోగించాలి. వాతావరణానికి తగ్గట్టుగా పిల్లలకు దుస్తులు వేయాలి.
    • చల్లగా, పొడిగా ఉన్న వాతావరణంలో పిల్లల పెదవులకు కొబ్బరి నునె లేదా బేబీ సేఫ్ లిప్ బామ్ రాయాలి.
    • డీహైడ్రేషన్ సమస్య రాకుండా పిల్లలకు తరచుగా పాలు ఇస్తుండాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? ఇక్కడ తెలుసుకోండి

    ముగింపు

    పిల్లల్లో పెదవులు పగలడం సర్వసాధారణం. ఇంటి చిట్కాలతో నయం చేయొచ్చు. అయితే ఎక్కువకాలం ఈ సమస్య ఉంటూ, ఇతర లక్షణాలు కనిపిస్తే, వైద్యులను సంప్రదించాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.