hamburgerIcon
login

VIEW PRODUCTS

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • టీ ట్రీ ఫేస్ టోనర్ వయసు వల్ల వచ్చే చర్మపు మార్పులను ఆపడంలో సహాయపడుతుందా (Can a tea tree face toner help to control aging skin in Telugu) ? arrow

In this Article

    టీ ట్రీ ఫేస్ టోనర్ వయసు వల్ల వచ్చే చర్మపు మార్పులను ఆపడంలో సహాయపడుతుందా (Can a tea tree face toner help to control aging skin in Telugu) ?

    Pregnancy

    టీ ట్రీ ఫేస్ టోనర్ వయసు వల్ల వచ్చే చర్మపు మార్పులను ఆపడంలో సహాయపడుతుందా (Can a tea tree face toner help to control aging skin in Telugu) ?

    3 November 2023 న నవీకరించబడింది

    టీ ట్రీ టోనర్‌ను వాడటం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిర్ణీత చికిత్సలను ఉపయోగించే బదులు, ప్రత్యామ్నాయ ఎంపిక కూడా ఉంది. టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించడం వల్ల అది చర్మం, గోర్లు, జుట్టు సమస్యలు ఇంకా వాటి లక్షణాలు అన్నింటిని తగ్గించేందుకు సహాయపడవచ్చు. నోటి దుర్వాసనను పోగొట్టే మౌత్ వాష్, సువాసన వెదజల్లే డియోడరెంట్, కీటకాల నివారిణిగా దీనిని వాడవచ్చు. టీ ట్రీ ఆయిల్ వివిధ రకాల చర్మ రుగ్మతలను నయం చేయడానికి లేదా చర్మాన్ని మెరుగుపరచడానికి సమయోచితంగా ఉపయోగించవచ్చు.

    టీ ట్రీ ఆయిల్ వల్ల చర్మానికి ఎన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది (How Tea Tree Oil Helps your Skin in telugu)

    టీ ట్రీ ఆయిల్‌ని ఉపయోగించి అనేక చర్మ రుగ్మతలకు ఉపశమనం కలిగించవచ్చు లేదా నయం చేయవచ్చు. టీ ట్రీ ఆయిల్ టోనర్‌ని ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

    • టీ ట్రీ ఫేస్ టోనర్‌ని నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. వాడేముందు ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి క్యారియర్ ఆయిల్‌ను దానికి కలిపి పలుచన చేయడం చాలా ముఖ్యం.
    • ఒకటి నుండి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌కి 12 చుక్కల క్యారియర్ ఆయిల్ కలపాలి.
    • టీ ట్రీ ఆయిల్‌ను కళ్ల దగ్గర అప్లై చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉండాలి. ఎండలో ఉన్నప్పుడు ఎర్రగా మారడం, ఇంకా అసౌకర్యం వంటి దుష్ఫలితాలు కలుగుతాయి.
    • టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించే ముందు మీ చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయాలి, అది మీ చర్మానికి రియాక్షన్ కలిగించలేదని నిర్ధారించుకోవాలి.

    1. పొడి చర్మం, ఎక్జిమా (Dry skin and eczema)

    టీ ట్రీ ఆయిల్ పొడి చర్మం ఉన్నప్పుడు వచ్చే దురద, చికాకును తగ్గిస్తుంది. ఎక్జిమా చికిత్సలో జింక్ ఆక్సైడ్, క్లోబెటాసోన్ బ్యూటిరేట్ కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ముఖానికి వాడేందుకు టీ ట్రీ టోనర్‌కు మాయిశ్చరైజర్ లేదా క్యారియర్ ఆయిల్‌ని కలపాలి. స్నానం చేసిన తర్వాత రోజుకు ఒకసారి ఈ మిశ్రమాన్ని రాసుకోండి.

    2. జిడ్డు చర్మానికి (Oily skin)

    టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జిడ్డు చర్మం నియంత్రణకు సహాయపడుతాయి. 2016 నాటి ఒక పరిశోధనలో టీ ట్రీ ఆయిల్ ఆధారిత సన్‌స్క్రీన్ 30 రోజుల పాటు వాడితే జిడ్డును తగ్గిస్తుందని తేలింది. టీ ట్రీ ఆయిల్‌ను టోనర్ మాయిశ్చరైజర్ లేదా సన్‌స్క్రీన్‌తో కలపండి. టీ ట్రీ ఆయిల్‌తో బెంటోనైట్ క్లే ఒక మాస్క్‌లా పనిచేస్తుంది.

    3. దురదపెట్టే చర్మానికి (Itchy skin)

    టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మపు బాధను ఉపశమింపజేస్తాయి. ఇది దురద ఇంకా చర్మ రుగ్మతలను తగ్గించడమే కాకుండా నయం కూడా చేస్తుంది. 2012 లో జరిగిన పరిశోధన ప్రకారం టీ ట్రీ ఆయిల్ కళ్ల మంటను తగ్గిస్తుంది. ఇందులో పాల్గొన్న వారి కళ్లను 5% టీ ట్రీ ఆయిల్ లోషన్‌తో అద్దారు. ఇందులో పాల్గొన్న 24 మందిలో 16 మందికి కళ్ల మంట తగ్గింది. మరో ఎనిమిది మంది పరిస్తితి మెరుగైంది. టీ ట్రీ ఆయిల్‌ను మాయిశ్చరైజర్ లేదా క్యారియర్ ఆయిల్‌తో మిక్స్ చేసి ప్రతిరోజూ చర్మానికి అప్లై చేయండి.

    4. మంట/వాపు (Inflammation)

    టీ ట్రీ ఆయిల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణం వల్ల ఎర్రబడిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. ఇది వాపు, ఎరుపును తగ్గిస్తుంది. టీ ట్రీ ఆయిల్ నికెల్-సెన్సిటివ్ స్కిన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ పరిశోధన చర్మంపై స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించి చేసినది. క్యారియర్ ఆయిల్‌ కూడా అందులో కలుపుతారు. క్యారియర్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌కి ఒక చుక్క టీ ట్రీ ఆయిల్‌ను రోజుకు అనేక సార్లు కలపాలి.

    5. ఇన్ఫెక్షన్లు, కోతలు, గాయాలు (Infections, cuts, wounds)

    యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న టీ ట్రీ ఆయిల్ గాయాలను నయం చేస్తుంది. 2013 లో జరిగిన పరిశోధన ప్రకారం టీ ట్రీ ఆయిల్ బ్యాక్టీరియా కారణంగా అయ్యే గాయాలను నయం చేస్తుంది. ప్రామాణిక థెరపీతో టీ ట్రీ ఆయిల్ చికిత్స పొందిన 10 మందిలో తొమ్మిది మంది వేగంగా కోలుకున్నారు. ఒక చుక్క టీ ట్రీ ఆయిల్‌ను గాయానికి వాడే ఆయింట్మెంటుపై వేసి రోజంతా వాడండి.

    6. కాస్మోటాలజీ (Cosmetology)

    టీ ట్రీ ఆయిల్ కాలుష్య కారకాలను, ఇంకా మృత చర్మ కణాలను తొలగించి చుండ్రును నయం చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ జుట్టును ఆరోగ్యంగా, హైడ్రే ట్‌గా ఉంచుతుంది. పెరుగుదలకు సహాయపడుతుంది. ముఖంపై టీ ట్రీ టోనర్‌ను ఎలా ఉపయోగించాలి: టీ ట్రీ ఆయిల్, క్యారియర్ ఆయిల్‌ని జుట్టు, తలపై అప్లై చేయండి. 5 శాతం టీ ట్రీ ఆయిల్ షాంపూని ఉపయోగించండి. కొన్ని నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోండి.

    7. మొటిమలు (Acne)

    టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నయం చేయడంలో తోడ్పడుతాయి. ఎరుపు, వాపు, మంట తగ్గుతాయి. ఇది స్కిన్‌పై మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను సైతం తగ్గించి, మృదువైన, క్లీన్ స్కిన్‌గా చేస్తుంది. ఉపయోగించడం: 2 ఔన్సుల విచ్ హాజెల్‌లో 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి దీనిని రోజంతా టోనర్‌గా వాడవచ్చు. మీరు టీ ట్రీ ఆయిల్‌తో కూడిన ఫేస్ క్లెన్సర్, మాయిశ్చరైజర్, స్పాట్ ట్రీట్‌మెంట్‌ని కూడా ప్రయత్నించవచ్చు.

    8. సోరియాసిస్ (Psoriasis)

    సోరియాసిస్ కోసం టీ ట్రీ ఆయిల్ చికిత్స నిరూపణ జరగలేదు. టీ ట్రీ ఆయిల్ రోగనిరోధక శక్తిని పెంచేటప్పుడు ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్ సహా సోరియాసిస్ లక్షణాలను తగ్గించగలదని దైనందిన జీవిత పరిశోధన తెలుపుతోంది. ఉపయోగించడం: టీ ట్రీ ఆయిల్‌ను క్యారియర్ ఆయిల్‌తో కలిపి పలుచన చేయాలి. రోజుకు పలుమార్లు అప్లై చేసుకోవాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ప్రయత్నించడానికి సురక్షితమైన టాప్ 10 బ్యూటీ ట్రీట్‌మెంట్స్

    Tags

    Tea tree oil, uses of applying tea tree oil in telugu, benefits of tea tree oil in telugu, Can a tea tree face toner help to control aging skin in English, Can a tea tree face toner help to control aging skin in Hindi, Can a tea tree face toner help to control aging skin in Tamil, Can a tea tree face toner help to control aging skin in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.